CM KCR: ధరణిని తీసేస్తే రైతు బంధు నిధులు ఎలా.. ఉచిత విద్యుత్, ధరణిపై విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్..
Telangana News: యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసెడెంట్ అనిల్ కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... 3 గంటల విద్యుత్ అంటే కాంగ్రెస్‌ను రైతులు తిట్టుకుంటున్నారని..
హైదరాబాద్, జూలై 24: దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసెడెంట్ అనిల్ కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… 3 గంటల విద్యుత్ అంటే కాంగ్రెస్‌ను రైతులు తిట్టుకుంటున్నారని.. 24 గంటలు ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని చెప్పారు. తనకంటే ముందు ఎందరో ముఖ్యమంత్రిులు పనిచేశారని.. కానీ తాము మాత్రమే ఒక ప్రణాళిక ప్రకారం పని చేశామన్నారు సీఎం కేసీఆర్.
ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని వివరించారు. ధరణిని తీసేద్దామా.. ధరణిని క్లోజ్ చేస్తే రైతు బంధు డబ్బులు ఎలా జమ చేయాలి..అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందన్నారు సీఎం కేసీఆర్.
గతంలో కంటే తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని.. ధరణి ద్వారా భూ యజమానులు మాత్రమే కాకుండా.. భూమి ఇతరులపైకి మార్చగలరని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం