Tomato Price: గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో రూ. 70లకే కిలో టమాటా.. ఎక్కడ కొనాలంటే..
ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ( ONDC ) ద్వారా కిలోగ్రాముకు రూ. 70 సబ్సిడీతో టొమాటోలను విక్రయించడం ప్రారంభించినందున మీరు ఇప్పుడు మీ ఇంటి నుండి కేవలం రూ. 70కి టమాటాలను కొనుగోలు చేయవచ్చు.
ఇప్పుడు బయట ఎక్కడ చూసినా టమాటా హాట్ టాపిక్. సామాన్యుడికి అందనంత స్థాయికి ఎదిగిపోయింది టమాట. దేశవ్యాప్తంగా వందలు దాటి దాదాపు 200 కేజీ ధర కూడా దాటింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం టమాటాలను రూ. 70 కే అందజేయాలని నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తో పాటు నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు సూచన చేసింది కేంద్రం. టమాటా ధర పదుల సంఖ్యను దాటుకొని వందల రూపాయలకు చేరుకుంది ఈ నేపథ్యంలో సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా టమాటాలను సబ్సిడీపై అందించాలని NCCF,NAFED లకు కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆదేశాలతో టమాటాను మొదట 90 కి అందించినప్పటికీ ఆ తర్వాత 80 కి ఇప్పటినుంచి 70కి ఇవ్వాలని నిర్ణయించారు.
ఎవరైతే టమాటా ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు వారికి ఎలాంటి అడిషనల్ చార్జెస్ విధించకుండా కేవలం 70 రూపాయలకు కేజీ టమాటాను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆన్లైన్ పర్చేస్ కోసం స్పెషల్ గా యాప్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. అయితే ఆన్లైన్లో టమాటలు పరిచయం చేయడానికి ప్రతి వ్యక్తికి కేవలం రెండు కిలోల వరకు మాత్రమే అనుమతినిస్తూ కొన్ని రూల్స్ పెట్టారు అధికారులు.
దీంతోపాటు కేవలం దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రమే ఈ టమాటాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఢిల్లీ పరిస్థితి తర్వాత మిగతా ప్రాంతాల్లో ఆన్లైన్లో సబ్సిడీపై టమాటల ను అందించడం అంశంపై ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం