AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈస్ట్‌ ఇండియా కంపెనీలో కూడా INDIA ఉంది.. విపక్ష కూటమిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..

Parliament monsoon session: విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన ఈస్ట్‌ ఇండియాతో కంపెనీతో పోల్చారు. తీవ్రవాద సంస్థలు ఇండియన్‌ ముజాహిద్దీన్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాలోనూ..

PM Modi: ఈస్ట్‌ ఇండియా కంపెనీలో కూడా INDIA ఉంది.. విపక్ష కూటమిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2023 | 12:20 PM

Share

Parliament monsoon session: విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన ఈస్ట్‌ ఇండియాతో కంపెనీతో పోల్చారు. తీవ్రవాద సంస్థలు ఇండియన్‌ ముజాహిద్దీన్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాలోనూ ఇండియా ఉందనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రదాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఓడిపోయి, అలసిపోయి, నిరాశలో కూరుకుపోయిన విపక్షం కేవలం తనను వ్యతిరేకించడమే ఏకైక అజెండాగా వ్యవహరిస్తోందని ప్రధాని అన్నారు. ఇండియా అనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. నినాదాలతో నాలుగు రోజులుగా లోక్‌సభ, రాజ్యసభ దద్దరిల్లుతున్నాయి. అన్ని వ్యవహారాలు పక్కన పెట్టి తక్షణమే మణిపూర్‌ హింసపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్తున్నా పార్లమెంట్‌లో చర్చ ప్రారంభం కావడం లేదు. లోక్‌సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకే స్పీకర్‌ మొగ్గు చూపుతున్నారు. విపక్షాలు దాన్ని అడ్డుకోవడంతో సభలో గందరగోళం చోటుచేసుకుంటోంది. ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమయ్యారు. కాని మణిపూర్‌పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్వీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

లోక్‌సభతో పోల్చితే రాజ్యసభ ఒకింత ప్రశాంతంగా ఉన్నా అక్కడ కూడా చర్చకు సంబంధించి నియమాల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజ్యసభ నిబంధన 267 కింద చర్చను తొలుత చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ముందుగానే స్వల్పకాలిక చర్చకు తాను అనుమతించానని సభాధ్యక్షుడు జగదీప్‌ ధన్కడ్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో సభాధ్యక్షుడు మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..