AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadchiroli: హృదయవిదారక ఘటన.. అన్న శవాన్ని బైక్ మీద కట్టి స్వగ్రామానికి తరలించిన తమ్ముడు..

గడ్చిరోలిలోని భామ్రాగడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు, ఒక యువకుడి మృతదేహాన్ని బైక్‌పై కట్టి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. గణేష్ తెలమి అనే యువకుడు గత కొంతకాలం నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు.

Gadchiroli: హృదయవిదారక ఘటన.. అన్న శవాన్ని బైక్ మీద కట్టి స్వగ్రామానికి తరలించిన తమ్ముడు..
Gadchiroli News
Surya Kala
|

Updated on: Jul 25, 2023 | 11:59 AM

Share

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. గ్రామాలు, నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగుల కోసం అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నాయని పేర్కొంటున్నాయి. అయితే తాజాగా అక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశ్నించే విధంగా ఒక వాదన తెరపైకి వచ్చింది. గడ్చిరోలి జిల్లా ఆసుపత్రిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో బంధువులు యువకుడి మృతదేహాన్ని బైక్‌పై కట్టి తీసుకొచ్చారు. ఇది చూసిన ప్రజలు షాక్ తిన్నారు.

గడ్చిరోలిలోని భామ్రాగడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు, ఒక యువకుడి మృతదేహాన్ని బైక్‌పై కట్టి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. గణేష్ తెలమి అనే యువకుడు గత కొంతకాలం నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. గడ్చిరోలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా తగినంత విశ్రాంతి తీసుకోలేదు. దీంతో కొద్దిరోజుల క్రితం పరిస్థితి విషమించడంతో గణేష్ ను కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ గణేష్ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. రోజురోజుకూ ఆ యువకుడి పరిస్థితి మరింత దిగజారింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి గణేష్ మృతి చెందినట్లు సమాచారం. మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఆసుపత్రిలోని అంబులెన్స్ కోసం బంధువులు రాత్రంతా చూశారు. అయినప్పటికీ అంబులెన్స్ దొరకలేదు.

ఇవి కూడా చదవండి

మృతదేహాన్ని బైక్‌పై కట్టిమరీ తరలించిన బంధువులు  ఈరోజు ఉదయం కూడా అంబులెన్స్ కోసం బంధువులు చూసినా లభ్యంకాలేదు. గణేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకుని వెళ్ళడానికి  ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులు విసిగి వేసారి గణేష్ మృతదేహాన్ని మంచంపై ఉంచి బైక్‌పై కట్టి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో దారిలో ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. గణేష్ సోదరుడు బైక్‌పై మృతదేహంతో గ్రామ కూడలికి చేరుకోగానే జనం గుంపులు గుంపులుగా చేరుకున్నారు.

సోదరుడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేయడంతో శవాన్ని తరలించడానికి అంబులెన్స్ బుక్ చేసుకోవడానికి డబ్బు లేదని చెప్పాడు. అందుకనే ప్రభుత్వం ఇచ్చే అంబులెన్స్ కోసం రాత్రి నుంచి చూశామని గణేష్ సోదరుడు చెప్పాడు. ఆసుపత్రి సిబ్బందికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నాడు. దీంతో ఆందోళనకు గురైన వ్యక్తులు బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకొచ్చారు. మరోవైపు, ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేయవచ్చా అని ప్రజలు అడగగా.. గణేష్ సోదరుడు తన అన్నయ్య చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చు చేశామని.. దీంతో అంబులెన్స్ బుక్ చేసుకోవడానికి తమ వద్ద డబ్బు లేదని చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..