Viral News: కొన్ని నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం అంత ఈజీ కాదు గురూ..! హౌస్ ఓనర్ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తేనే రెంట్‌కు దొరుకుతుంది..
ఆ ఇల్లు అద్దె బడ్జెట్లో ఉందొ లేదో చూసుకోవాలి. ఇలా ఇంటిని అద్దె కోసం వెదికేవారు అనేక కష్ఠాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కొన్ని చోట్ల ఇంటి యజమానులు నాన్-వెజ్ తినేవారికి ఇంటిని అద్దెకు ఇవ్వరు. మరికొన్నీ చోట్ల మతం ఆధారంగా ఇంటిని అద్దెకు పొందుతారు. ముఖ్యంగా బ్యాచ్ లర్స్ కి అయితే గది అద్దెకు దొరకడం అత్యంత కష్టం. అయితే ప్రస్తుతం బెంగళూరు లో ఇంటి అద్దెకు తీసుకోవడానికి ఒక వ్యక్తికీ ఎదురైన అనుభవం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొందరు ఇలాంటివి కూడా జరుగుతాయా అంటూ ఆశ్చర్య పడుతున్నారు.
ఎవరైనా ఉన్న ప్రాంతం నుంచి కొత్త చోటికి వెళ్లితే అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త నగరానికి వెళ్ళితే అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరూ తెలియని కొత్తప్రాంతాలకు వెళ్తే.. ఉండడానికి ఇల్లు.. తినే ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కొందరు. అద్దెకు ఇంటిని వెదకడం ఒక సవాల్ తో కూడుకున్న పని. కొన్నిసార్లు కావలసినట్లు ఇల్లు అందుబాటులో ఉండదు. కొన్నిసార్లు కష్టపడకుండానే కోరినట్లు ఉండే నివాసం దొరుకుంటుంది. అప్పుడు ఆ ఇల్లు అద్దె బడ్జెట్లో ఉందొ లేదో చూసుకోవాలి. ఇలా ఇంటిని అద్దె కోసం వెదికేవారు అనేక కష్ఠాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కొన్ని చోట్ల ఇంటి యజమానులు నాన్-వెజ్ తినేవారికి ఇంటిని అద్దెకు ఇవ్వరు. మరికొన్నీ చోట్ల మతం ఆధారంగా ఇంటిని అద్దెకు పొందుతారు. ముఖ్యంగా బ్యాచ్ లర్స్ కి అయితే గది అద్దెకు దొరకడం అత్యంత కష్టం. అయితే ప్రస్తుతం బెంగళూరు లో ఇంటి అద్దెకు తీసుకోవడానికి ఒక వ్యక్తికీ ఎదురైన అనుభవం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొందరు ఇలాంటివి కూడా జరుగుతాయా అంటూ ఆశ్చర్య పడుతున్నారు.
నిజానికి గది అద్దెకు ఇవ్వడానికి ముందు ఓ ఇంటి యజమాని తనను చేసిన ఇంటర్వ్యూ .. పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చానా అనిపించిందని పేర్కొన్నాడు. అంతేకాదు ఇంటి యజమాని తనను వేసిన ప్రశ్నలు.. అద్దె ఇంటి కోసం తన వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
నీరజ్ మెంటా అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో తన ‘అద్దె ఇంటి కోసం యజమాని ఇంటర్వ్యూ’ అంటూ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ సీడ్ రౌండ్ పిచ్ కంటే చాలా కష్టంగా .. అతి సుదీర్ఘంగా సాగిందని చెప్పాడు. ఇంటి యజమాని ఇంటర్వ్యూ చేయడానికి ముందు బ్రోకర్ .. ఇంటి యజమాని .. అతని భార్య లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌తో పాటు తన కుటుంబ నేపథ్య సమాచారం అడిగారని చెప్పాడు. అనంతరం ఇంటిని రెంట్ కి ఇచ్చే విషయంలో తన ప్రొఫైల్ ను షార్ట్‌లిస్ట్ చేశారని బ్రోకర్ చెప్పాడు. అంతేకాదు తనకు గది ఇచ్చే ముందు ఇంటి యజమాని తనతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు.
My tenant interview was longer and more grueling than my Seed round pitch. I recently started househunting in Bangalore and one owner wanted to interview me before saying yes. A 🧵 of all the questions #bangalorehousehunt @peakbengaluru
— Neeraj Menta (@neerajmnt) July 12, 2023
ఇంటి యజమానితో మాట్లాడటం ఒక ఇంటర్వ్యూ లా సాగిందని నీరజ్ చెప్పాడు. మొదట తన నేపథ్యం గురించి అడిగారు. అనంతరం తన కుటుంబం సభ్యులు ఎంతమంది.. ఎంత మంది తనతో కలిసి ఉంటారు వంటి అనేక ప్రశ్నలు యజమాని అడగడం ప్రారంభించాడు. అంతేకాదు తన వృత్తి, లాభాలు, పెట్టుబడి వంటి ఆర్ధిక విషయాలను గురించి కూడా అడిగాడు. అంటూ తన గది అద్దె తీసుకోవడానికి ఇంటర్వ్యూలో జరిగిన విధానం వెల్లడించాడు. ఈ విషయం సోషల్ మీడియాకు చేరడంతో నీరజ్ ను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. కొంతమంది వినియోగదారులు నీరజ్‌ను ఇంటర్వ్యూ తర్వాత మీకు అద్దెకు ఇల్లు దొరికిందా అని అడిగారు, దానికి సమాధానంగా నీరజ్ అవును, తనకు ఇల్లును అద్దెకు ఇచ్చారని పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..