Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏనుగుని చూసి పారిపోయిన సింహం.. తల్లి మనసు అంటే ఇదే .. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..

అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ల్లో ఒకటి సింహం. అడవి రాజు సింహం అంటే అన్ని జంతువులకు హడలే. అదే సమయంలో భూమి మీద అతి పెద్ద జంతువు బలమైన, తెలివైన జంతువు ఏనుగు. అయితే అడవికి రాజైన సింహానికి గజరాజు ఎదురైతే.. అక్కడ ఎలాంటి సీన్ జరుగుతుంది ఎప్పుడైనా ఊహించారా..

Viral Video: ఏనుగుని చూసి పారిపోయిన సింహం.. తల్లి మనసు అంటే ఇదే .. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 16, 2023 | 5:25 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రజలకు బాగా నచ్చుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి రానంత వరకూ జంతు ప్రపంచం ఎలా ఉంటుందో చూడడానికి డిస్కవరీ ఛానెల్‌పై ఆధారపడే వారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్కా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం రోజూ చూడని జంతువుల జీవితాన్ని కనులముందుకే తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ నవ్వును నియంత్రించుకోలేరు.

అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ల్లో ఒకటి సింహం. అడవి రాజు సింహం అంటే అన్ని జంతువులకు హడలే. అదే సమయంలో భూమి మీద అతి పెద్ద జంతువు బలమైన, తెలివైన జంతువు ఏనుగు. అయితే అడవికి రాజైన సింహానికి గజరాజు ఎదురైతే.. అక్కడ ఎలాంటి సీన్ జరుగుతుంది ఎప్పుడైనా ఊహించారా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగుని చూసి భయంతో పారిపోతున్న సింహాన్ని చూడవచ్చు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఆడ సింహం గడ్డి పొదల్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి కూర్చుంది. వాటితో  సరదాగా గడుపుతుంది. ఇంతలో అటుగా ఒక భారీ ఏనుగు అటుగా వస్తుంది. అది చూసి సింహం చాలా కంగారుపడింది. సింహం భయంతో వణికి.. ముందుగా తన పిల్లలను దాచడానికి ప్రయత్నించింది. అయితే తన పిల్లలను ఏనుగునుంచి రక్షించడం కష్టం అనుకుందో ఏమో.. ఒక పిల్లను తన నోట కరుచుకుని పారిపోయింది. మిగిలిన రెండు పిల్లలు తల్లిని అనుసరించాయి.. అయితే సింహం కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.. ఒక కాలిని పైకి ఎత్తి మూడు కాళ్లతో శక్తి కొలదీ ఏనుగుకి దూరంగా పారిపోయింది.

ఈ వీడియోను యూట్యూబ్‌లో మాసాయి సైటింగ్స్ షేర్ చేసింది. ఇప్పటికే వేలాది లైక్స్, వందల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఒకరు ‘సింహం కోరుకుంటే.. ఏనుగుతో పోరాడేది.. అయితే ఇక్కడ తన తన పిల్లల గురించి ఆలోచించింది. అందుకనే అక్కడ నుంచి పారిపోయిందని కామెంట్ చేశారు. మరొకరు ‘తల్లి పిల్లల కోసమే ఈ తన అడుగులు మార్చుకుంది అని వ్యాఖ్యానించగా.. వీడియో నిజంగా సరదాగా ఉంది’ అని అన్నారు.

మరిన్నిట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?