AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Street Dogs: 14 కుక్కలను 3 ఏళ్ల పాటు ప్లాట్‌లో బంధించిన మహిళ.. ఆహారం పెట్టకపోవడంతో మరణించే స్టేజ్‌కు చేరుకున్న శునకాలు..

వాస్తవానికి  ప్లాట్ దగ్గరకు వెళ్ళినప్పుడు పోలీసులను లోపలికి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. అడ్డు చెప్పింది. దీంతో పోలీసులు సెర్చ్ వారెంట్ పొందారు. MCD, SPCAలను కలిపి జాయింట్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఆ ఫ్లాట్‌కు చేరుకుంది.

Street Dogs: 14 కుక్కలను 3 ఏళ్ల పాటు ప్లాట్‌లో బంధించిన మహిళ.. ఆహారం పెట్టకపోవడంతో మరణించే స్టేజ్‌కు చేరుకున్న శునకాలు..
Street Dogs
Surya Kala
|

Updated on: Jul 07, 2023 | 7:10 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియా గ్రేటర్ కైలాష్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ గత 2 నుంచి 3 ఏళ్లుగా తన ఫ్లాట్‌లో దాదాపు 14 వీధి కుక్కలను బందీలుగా ఉంచింది. అయితే బాధించిన కుక్కలకు సరైన ఆహారం అందకపోవడంతో కుక్కల పరిస్థితి కూడా దిగజారింది. కుక్కలన్నీ చాలా బలహీనంగా మారాయి.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ డీసీపీ చందన్ చౌదరి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, దుర్వాసనతో నిండిపోయింది.. తాము ఉండలేకపోతున్నాం అంటూ పొరుగువారు నిత్యం ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసు బృందం ఆ ఫ్లాట్‌కు చేరుకుంది. అప్పుడు బాధించబడిన కుక్కలను గుర్తించిన పోలీసులు.. వాటిని తరలించడానికి సిద్ధమయ్యారు. అయితే తన కుక్కలను తీసుకుని వెళ్లవద్దంటూ మహిళ పోలీసులను చాలా ప్రాధేయపడింది. కుక్కలను పోలీసులకు అప్పగించడానికి నిరాకరించింది.

ఫ్లాట్ లోపలి దృశ్యాన్ని చూసిన పోలీసులు షాక్  వాస్తవానికి  ప్లాట్ దగ్గరకు వెళ్ళినప్పుడు పోలీసులను లోపలికి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. అడ్డు చెప్పింది. దీంతో పోలీసులు సెర్చ్ వారెంట్ పొందారు. MCD, SPCAలను కలిపి జాయింట్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఆ ఫ్లాట్‌కు చేరుకుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐహెచ్‌బిఎఎస్) బృందం కూడా హాజరైంది. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు లోపలి దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

చనిపోయే స్థితిలో ఉన్న 14 కుక్కలు  ఫ్లాట్ లోపల చీకటిగా ఉందని డీసీపీ చౌదరి తెలిపారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఫ్లాట్‌లో దాదాపు 14 కుక్కలు చనిపోయే స్టేజ్ లో ఉన్నాయి. ఇంటి లోపల చాలా అపరిశుభ్రంగా ఉంది. దుర్వాసన వెదజల్లడంతో నిలబడేందుకు ఇబ్బందిగా ఉంది. పోలీసులు సెర్చ్ వారెంట్ చూపించి మహిళకు నచ్చచెప్పి.. అక్కడ ఉన్న కుక్కలను వెటర్నరీ డాక్టర్ సమక్షంలో జంతు ఆసుపత్రికి తరలించారు. ఐహెచ్‌బిఎఎస్‌ బృందం ఆ మహిళకు కౌన్సెలింగ్ కూడా చేసింది.

కుక్కలను పోలీసులు రక్షించడంతో ఇరుగుపొరుగు వారు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఒక మహిళ తన ఫ్లాట్‌లో 3 సంవత్సరాల పాటు 14 కుక్కలను ఎలా బందీలుగా ఉంచిందో ఈ సంఘటనతో ఇరుగుపొరుగు ఆశ్చర్య పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..