Big News Big Debate: కేంద్రంతో 'ఢీ'..ఆర్ఎస్.. ప్రధానమంత్రి మోదీ పర్యటనపై మరోసారి పొలిటికల్‌ వార్‌‌.

Big News Big Debate: కేంద్రంతో ‘ఢీ’..ఆర్ఎస్.. ప్రధానమంత్రి మోదీ పర్యటనపై మరోసారి పొలిటికల్‌ వార్‌‌.

Anil kumar poka

|

Updated on: Jul 07, 2023 | 7:01 PM

ఓరుగల్లు వేదికగా తెలంగాణ పార్టీల మధ్య రాజకీయ పోరు మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటనను బహిష్కరిస్తామంటోంది బీఆర్ఎస్. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కంటే వ్యక్తిగత రాజకీయాలకే కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీస్తోంది బీజేపీ. అయితే ఇదంతా కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్న పెద్ద డ్రామాగా కొట్టిపారేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ప్రధాని మోదీ టూర్‌ను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్షలాది మందితో సభను సక్సెస్‌ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా వరంగల్‌లోనే మకాం వేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మోదీ టూర్‌లో అధికారిక కార్యక్రమాలు కూడా ఉండటంతో సీఎం కేసీఆర్‌కు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందించారు. అలాగే మోదీ పక్కన సీటు కూడా కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీచ్‌కి 5 నిమిషాల సమయం కేటాయించారు. అయితే హాజరుకాకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ పుట్టుకను ప్రధాని మోదీ అవమానించారని.. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. మోదీ టూర్‌ని బీఆర్‌ఎస్ బహిష్కరిస్తుందన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రధానమంత్రి తెలంగాణపై వ్యతిరేకత చూపించారంటోంది బీఆర్ఎస్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...