AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Driver: బస్సుడ్రైవర్‌ షర్మిల కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్‌..

కష్టపడి, ఏదైనా సాధించాలనే పట్టుదలతో సాహసోపేతమైన రంగాన్ని ఎంచుకుని, ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టుదలగా డ్రైవింగ్‌ నేర్చుకుని అత్యంత నైపుణ్యంతో భారీ వాహనం అయిన బస్సుని నడుపుతూ అందరినీ ఆకట్టుకుంది షర్మిల. అంతేకాదు కోయంబత్తూరులో మొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా నిలిచింది

Woman Driver: బస్సుడ్రైవర్‌ షర్మిల కొంపముంచిన  పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్‌..
Female Driver Sharmila
Surya Kala
|

Updated on: Jun 24, 2023 | 11:18 AM

Share

గతంలో వ్యాపారంలాభాల బట్టలని తమ సంస్థకు చెందిన వస్తువులను ప్రజల్లో తీసుకుని వెళ్లడానికి పబ్లిసిటీ ఇచ్చేవారు. మారుతున్న కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ పబ్లిసిటీ సరికొత్త పుంతలు తొక్కింది. ఇప్పుడు వస్తువులు, ఆహారం అది ఇది అనే లేదు.. చివరకి తనని తానే పబ్లిసిటీ చేసుకుంటున్నారు.  ఒక్కోసారి పబ్లిసిటీ కూడా కొందరిపాలిట శాపంగా మారుతుంది. ఎవరికైనా కాస్త గుర్తింపు వస్తున్నా, కాస్త ఉన్నతంగా ఎదుగుతున్నా వారికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తారు కొందరు. వారికి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ మహిళా బస్సు డ్రైవర్‌కి. ఆమె ఎవరో కాదు. ఆ మధ్య తమిళనాడులో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా సంచలనం సృష్టించి షర్మిల. ఇప్పుడు తను ఉద్యోగం కోల్పోయింది.

కష్టపడి, ఏదైనా సాధించాలనే పట్టుదలతో సాహసోపేతమైన రంగాన్ని ఎంచుకుని, ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టుదలగా డ్రైవింగ్‌ నేర్చుకుని అత్యంత నైపుణ్యంతో భారీ వాహనం అయిన బస్సుని నడుపుతూ అందరినీ ఆకట్టుకుంది షర్మిల. అంతేకాదు కోయంబత్తూరులో మొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా నిలిచింది. అతి తక్కువ కాలంలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. షర్మిల దైర్యంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ ప్రముఖులు, విఐపీలు సైతం నేరుగా షర్మిలను ప్రశంసించారు. సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా బస్సు డ్రైవర్‌ షర్మిలను కలిసి ప్రశంసించారు. దీంతో షర్మిల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

అయితే అకస్మాత్తుగా షర్మిలకు వచ్చిన పాపులారిటీ ఆమెపాలిట శాపమైంది. షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది యాజమాన్యం. ఇలా ఉద్యోగానికి తీసివేయడానికి కంపెనీ చెప్పిన కారణం వింటే ఎవరైనా షాక్  అవుతారు. షర్మిల కి పబ్లిసిటీ మోజు ఎక్కువైందని, పాపులారిటీ కోసం బస్సు లో ఉన్న ప్రయాణికుల్ని పట్టించుకోవడం లేదని యాజమాన్యం చెబుతోంది. అయితే ఎంపీ కణిమొళిని కలవడం వల్లే షర్మిలను ఉద్యోగంనుంచి తీసేసారని కొందరు, షర్మిల తీరుపై అసహనం కారణంగానే తీసేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే షర్మిల వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. నన్ను ట్రావెల్‌ యాజమాన్యం అవమానించింది అందుకే ఉద్యోగం మానేశాను అని చెబుతోంది. షర్మిల బస్సు డ్రైవర్ ఉద్యోగం ఎందుకుపోయిందనే వార్త.. మరోసారి సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..