Singer Mary Millben: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన అమెరికా గాయని.. వీడియో వైరల్
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో శనివారం అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ ఇండియన్ జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించారు. అనంతరం మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం చేశారు..
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో శనివారం అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ ఇండియన్ జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించారు. అనంతరం మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం చేశారు. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటరులో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తనదైన మోదీ అద్భుత ప్రసంగానికి అమెరికా కాంగ్రెస్ ఫిదా అయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ (30) భారత జాతీయ గీతం జన గణ మన ఆలపించారు. అనంతరం ఓం జై జగదీశే హరే పాట కూడా పాడారు.
జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించడానికి తనకు ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ కోసం భారత జాతీయ గీతాన్ని పాడటం గౌరవంగా భావిస్తున్నట్లు మేరీ వ్యాఖ్యానించారు. అమెరికన్, ఇండియన్ జాతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఆదర్శాలను తెలియజేస్తాయని, ఇది అమెరికా-భారత్ సంబంధాల సారాంశమని ఆమె అన్నారు. భారతీయ విలువలు, సంస్కృతి, ఆధ్యాత్మిక భావాలతో మోదీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందారని మేరీ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటన ముగియడంతో తదుపరి ఈజిప్టులో పర్యటనకు మోదీ పయనమయ్యారు.
“I will rest in the end, knowing that anything I did of great significance is because He (God) did it through me.”
Tonight as I perform the Indian National Anthem for Prime Minister @narendramodi and distinguished guests, India and Indian communities across the world, you are… pic.twitter.com/RXMVfLsCQg
— Mary Millben (@MaryMillben) June 23, 2023
US Singer Mary Millben touches @narendramodi Ji feet after singing National anthem pic.twitter.com/o4BsPPo9dD
— Tejinder Pall Singh Bagga (@TajinderBagga) June 24, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.