Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KP Chowdary Drugs Case: డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై స్పందించిన నటి ఆషూ రెడ్డి.. వైరల్‌ అవుతోన్న ఇన్‌స్టా పోస్ట్‌

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ ప్రకంపనలు గుప్పుమన్నాయి. కబాలి నిర్మాత కేపీ చౌదరి పోలీసుల దర్యాప్తులో పలువురు బడా బాబులు, సినీ సెలబ్రెటీల పేర్లు వెల్లడించాడు. ఐతే ఈ లిస్టులో బిగ్‌ బాస్‌ ఫేమ్ అషూరెడ్డి పేరు కూడా ఉన్నట్లు పలు వార్త సంస్థలు..

KP Chowdary Drugs Case: డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై స్పందించిన నటి ఆషూ రెడ్డి.. వైరల్‌ అవుతోన్న ఇన్‌స్టా పోస్ట్‌
Ashu Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2023 | 8:40 AM

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ ప్రకంపనలు గుప్పుమన్నాయి. కబాలి నిర్మాత కేపీ చౌదరి పోలీసుల దర్యాప్తులో పలువురు బడా బాబులు, సినీ సెలబ్రెటీల పేర్లు వెల్లడించాడు. ఐతే ఈ లిస్టులో బిగ్‌ బాస్‌ ఫేమ్ అషూరెడ్డి పేరు కూడా ఉన్నట్లు పలు వార్త సంస్థలు పేర్కొంటున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి ఫోన్‌ కాల్ లిస్ట్‌లో అషూ రెడ్డి పేరు ఉన్నట్లుగా పోలీసులు సైతం గుర్తించారు. దీంతో నటి పేరు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఈ వార్తలపై నటి అషూ రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా తాజాగా స్పందించింది.

డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలు అషూ రెడ్డి కొట్టిపారేసింది. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయింది. మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్‌ కేసులో సంబంధాలు లేవని, అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అసలైన వ్యక్తులెవరో గుర్తించాలని, సంబంధిత ఆధికారులకు వాస్తవమేమిటో తెలియచేస్తానని తెలిపింది. తన అనుమతిలేకుండా తన ఫోన్ నంబర్‌ను బహిరంగంగా ప్రదర్శిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు తెల్పుతూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు షేర్‌ చేసింది. మరో వైపు అషూరెడ్డితో ఉన్న సంబంధంపై కేపీ చౌదరి నోరు విప్పడంలేదని, సరైన ఆధారాలు అభ్యమైతే ఆమెను కూడా ప్రశ్నిస్తామని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.