‘అబద్దపు జీవితం జీవించకూడదు.. అందుకే నాకు పిల్లలు కలగలేదు..’

రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో ఈ ప్రోగ్రామ్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. స్టార్ హీరోలు, సెలబ్రెటీలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ప్రారంభమైన సంగతి..

'అబద్దపు జీవితం జీవించకూడదు.. అందుకే నాకు పిల్లలు కలగలేదు..'
Pooja Bhatt
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2023 | 9:18 AM

రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో ఈ ప్రోగ్రామ్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. స్టార్ హీరోలు, సెలబ్రెటీలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి కూడా 12 మంది సెలబ్రిటీలు హౌస్‌లో అడుగు పెట్టారు. వారిలో 1990లో ఎన్నో హిట్‌ మువీల్లో నటించిన ప్రముఖ నటి, దర్శకురాలు పూజా భట్‌ కూడా ఉన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి హౌలో తోటి కంటెస్టెంట్లకు బహిరంగంగా చెప్పుకొచ్చారు. మాజీ భర్త మనీష్ మఖిజాతో తన వైవాహిక జీవితం ఎందుకు వర్కవుట్ కాలేదో, తనకు పిల్లలు ఎందుకు కలగేదనే విషయాన్ని ఆమె వెల్లడించారు.

‘రెస్టారెంట్ యజమాని, వీడియో జాకీ అయిన మనీష్ మఖిజాను 2003 నేను వివాహం చేసుకున్నాను. పెళ్లయి దాదాపు 11 సంవత్సరాలైంది. మనీష్‌తో నా లైఫ్‌ చాలా బాగుండేది. అతను నటుడు కాదు. చాలా మంచి వ్యక్తి. ఐతే అబద్దపు జీవితం జీవించకూడదు. అది డ్రెస్ రిహార్సల్ కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ అవకాశం వస్తుంది. దానిని సద్వినియోగపరచుకోవాలి. కానీ నేను ఆ సమయంలో పిల్లలను కనాలనుకోలేదు. నాకు పిల్లలు కావాలి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. బ్లేమ్ గేమ్ నేను ఎప్పుడూ కోరుకోలేదు. సాధ్యమైనంత వరకూ మేమిద్దరం కలిసి జీవిచాం. తర్వాత ఫ్రెండ్లీగానే 2014లో విడిపోయామని’ తోటి కంటెస్టెంట్ బోబికా ధూర్వేతో పూజా చెప్పుకొచ్చారు.

తన తండ్రి మహేష్‌ భట్‌ బ్రతికి ఉన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ భావోధ్వేగానికి గురయ్యారు. ‘అప్పట్లో నేను విపరీతంగా మద్యం సేవించేదాన్ని. ఓ రోజు మా నాన్న నాకు ‘ఐ లవ్ యు కిడ్’ అని మెసేజ్‌ పంపారు. నేను ‘ఐ లవ్ యు పాప్స్’ అని రిప్లై ఇచ్చాను. మళ్లీ మెసేజ్‌ పెడుతూ.. ‘నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభించాలి. ఎందుకంటే నేను నీలో నివసిస్తున్నాను’ అని మెసేజ్‌ పంపారు. అది నాకు మేల్కొలుపు కాల్‌ లాంటిది. ఆ తర్వాత నేను ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదు. మా నాన్న భౌతికంగా ఉన్నాడా లేదా అనేది నా ఉద్దేశ్యం కాదు. ప్రేమ పర్వతాలను సైతం కదిలించగలదు. ఆ మెసేజ్‌ నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ మరుసటి రోజు నుంచే నేను ఆల్కహాల్ మానేశాను. ఆరేళ్ల తర్వాత నన్న చనిపోయారు. మళ్లీ నా పాత అలవాట్లవైపు వెళ్లలేదు. దాదాపు 30 ఏళ్ల క్రితం మద్యపానాన్ని విడిచిపెట్టేశాను’ అని పూజా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.