Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla: మానవత్వం మంటగలిసిన వేళ.. భార్య మాట విని తల్లిని కడతేర్చిన కొడుకు

ఆ ఇంట్లో నిత్యం అత్తాకోడళ్లు తగవులాడుకునేవారు. కొత్త ఇల్లు కట్టుకుని వేరే ఇంటికి వెళ్లినా ఇదే తంతు. తమ కొత్త ఇంటికి అత్తగారొస్తే తాను కాపురం చేయబోనని తెగేసి చెప్పిన భార్య. దీంతో ఆ కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఎనిమిది పదుల వయసున్న పండు ముదుసలి తల్లిని నీటి కుంటలో ముంచి..

Bapatla: మానవత్వం మంటగలిసిన వేళ.. భార్య మాట విని తల్లిని కడతేర్చిన కొడుకు
Man Kills Mother
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2023 | 8:05 AM

బాపట్ల: ఆ ఇంట్లో నిత్యం అత్తాకోడళ్లు తగవులాడుకునేవారు. కొత్త ఇల్లు కట్టుకుని వేరే ఇంటికి వెళ్లినా ఇదే తంతు. తమ కొత్త ఇంటికి అత్తగారొస్తే తాను కాపురం చేయబోనని తెగేసి చెప్పిన భార్య. దీంతో ఆ కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఎనిమిది పదుల వయసున్న పండు ముదుసలి తల్లిని నీటి కుంటలో ముంచి కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. రేణింగవరం ఎస్‌ఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన కె సుబ్బులమ్మ (85) భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో కుమారుడు శ్రీనివాసరావు, కోడలితో కలిసి జీవనం సాగిస్తోంది. ఐతే అత్త, కోడళ్లకు క్షణం కూడా పడేదికాదు. కొడుక్కి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య వివాదాలు సర్దుమనగలేదు. ఈ క్రమంలో ఇటీవల శ్రీనివాసరావు అదే గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండురోజుల క్రితం ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన శ్రీనివాసరావు భార్య అత్తగారు ఆ ఇంట్లో అడుగుపెడితే తాను ఉండబోనంటూ తెగేసి చెప్పింది.

దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీనివాసరావు తల్లిని అడ్డుతొలగించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అందరూ నిద్రపోయాక తల్లిని బైక్‌పై కూర్చోపెట్టుకుని ఊరి చివర ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లి, అందులోకి ఆమెను తోసేశాడు. ఆ తర్వాత ఏం ఎరగనట్లు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కుంటలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసుల దర్యాప్తులో కుమారుడు శ్రీనివాసరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలడంతో అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.