Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలులో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్‌.. 46 మంది మహిళా ఖైదీలు మృతి! 20 మంది సజీవ దహనం

అమెరికాలోని హోండురాస్‌ జైలులో దారుణం చోటుచేసుకుంది. రాజధాని నగరం తెగుసిగల్పాకు వాయువ్యంగా 50 కి.మీ. దూరంలో ఉన్న టమారాలోని మహిళా జైలులో మంగళవారం (జూన్‌ 20) ఘోర మారణకాండ చెలరేగింది. రెండు మూఠాల మధ్య ఘర్షనలు..

జైలులో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్‌.. 46 మంది మహిళా ఖైదీలు మృతి! 20 మంది సజీవ దహనం
Monstrous Murder
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 22, 2023 | 9:40 AM

హోండురాస్: అమెరికాలోని హోండురాస్‌ జైలులో దారుణం చోటుచేసుకుంది. రాజధాని నగరం తెగుసిగల్పాకు వాయువ్యంగా 50 కి.మీ. దూరంలో ఉన్న టమారాలోని మహిళా జైలులో మంగళవారం (జూన్‌ 20) ఘోర మారణకాండ చెలరేగింది. రెండు మూఠాల మధ్య ఘర్షనలు జరిగాయి. ఈ ఘటనలో 46 మంది మహిళా ఖైదీలు మృతి చెందారు. బారియో 18 గ్యాంగ్ సభ్యులు జైలులో కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పారిపోతున్న ఖైదీలను సెల్‌లో బంధించి దుండగులు నిప్పంటించారు. దీంతో అనేక మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. సుమారు 26 మంది ఖైదీలు కాల్పుల్లో మృతి చెందగా.. మిగిలిన వారు సజీవదహనమయ్యారు. దాడికి పాల్పడే ముందే ఖైదీలుఉన్న సెల్‌లకు తాళాలు వేసి, ఆ తరువాత కాల్పులు జరిపినట్లు హుండురాస్ జాతీయ పోలీసు దర్యాప్త సంస్థ ప్రతినిధి యూరి మోరా మీడియాకు తెలిపారు. హోండురాస్‌లోని జైలులో ప్రత్యర్థి ముఠాలు బార్రియో 18, మారా సాల్వత్రుచా (MS-13) సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఈ దారుణం జరినట్లు తెలుస్తోంది. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగా అల్లర్లు ప్రారంభమయ్యాయని కంట్రీ ప్రిజన్ సిస్టమ్‌ హెడ్ జూలిస్సా విల్లాన్యువా సూచించారు.

ఖైదీల సజీవ దహనం

సెల్‌ నుంచి తప్పించుకొని బయటకుపోతున్నవారిని ఈడ్చుకెళ్లి సెల్‌లోపల బంధించి నిప్పంటించినట్లు తెలిపారు. వారతా సజీవదహనమయ్యారని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిని తెగుసిగల్పా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురు మహిళా ఖైదీలు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య 46కు చేరినట్లు చెప్పారు. మరో ఏడుగురు కత్తి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ దారుణ ఘటన తర్వాత జైలుకు సంబంధించిన వీడియోను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్పుల్లో జైలులోపల తుపాకులు, కొడవళ్లు, ఇతర మారణాయుధాలు పడి ఉన్నాయి. ఈ ఘటనలో జైలు గార్డులు ఎవరూ గాయపడకపోవడం విశేషం.

2017 నుంచి చెలరేగుతున్న హింసాఖాండ

మహిళా ఖైదీల మరణ ఘటనపై హుండురాన్ అధ్యక్షులు జియోమారా కాస్ట్రో స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన తరువాత జైలులో ఉన్న ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలుకు చేరుకుని, తమ వారి యోగక్షమాల గురించ ఆరా తీస్తున్నారు. మృతి చెందిన ఖైదీల వివరాలు జైలు అధికారులు విడుదల చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుంచి ఈ ప్రాంతంలోని మహిళా నిర్బంధ కేంద్రంల్లో తరచూ అల్లర్లు జరుగుతున్నాయి. గ్వాటెమాలాలోని ఓ బాలికల షెల్టర్‌కు నిప్పంటించడంతో 41 మంది బాలికలు చనిపోయారు. 2012లో హోండురాస్‌లోని మరో జైలులో 361 మంది ఖైదీలు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.