Hanumakonda: వెంటపడిన కుక్కలు.. భయంతో పరుగులు తీసి ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతి

వీధి కుక్కలు వెంటపడటంతో ఓ బాలుడు భయంతో పరుగులు తీశాడు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్‌ కిందపడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో మంగళవారం (జూన్‌ 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Hanumakonda: వెంటపడిన కుక్కలు.. భయంతో పరుగులు తీసి ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతి
Class 6 Student Falls Under Tractor
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2023 | 12:49 PM

హనుమకొండ: వీధి కుక్కలు వెంటపడటంతో ఓ బాలుడు భయంతో పరుగులు తీశాడు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్‌ కిందపడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో మంగళవారం (జూన్‌ 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హనుమకొండ జిల్లా, కమలాపూర్‌ మండలంలోని మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్‌, స్వప్న దంపతుల ఏకైక సంతానం ధనుష్‌ (10). స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ధనుష్‌ పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బాలుడు రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ బాలుడిన ఢీ కొట్టింది. ఆ సమయంలో ట్రాక్టర్‌ డ్రైవర్ తోట విజయేందర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపినట్లు స్థానికులు ఆరోపించారు. డ్రైవర్‌ అజాగ్రత్త మూలంగానే ట్రాక్టర్‌ బాలుడుని ఢీ కొట్టింది.

ప్రమాదంలో ట్రాక్టర్‌ కింద పడిన బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు అకాల మృతి చెందడంతో ధనుష్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ట్రాక్టర్‌ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్‌ తోట విజయేందర్‌లపై ధనుష్‌ తండ్రి జయపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.