AP Lawcet 2023 Results: ఆంధ్రప్రదేశ్ లా సెట్-2023 ఫలితాలు వచ్చేశాయ్.. టాపర్లు వీరే!
AP Lawcet 2023 Toppers List: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్, పీజీ ఎల్ సెట్-2023 పరీక్షల ఫలితాలు శుక్రవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు..
AP Lawcet 2023 Toppers List: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్, పీజీ ఎల్ సెట్-2023 పరీక్షల ఫలితాలు శుక్రవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మే 20న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు16,203 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 13,402 మంది అర్హత సాధించినట్లు వీసీ రాజశేఖర్ ప్రకటించారు. కాగా లాసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
టాపర్లు వీరే..
ఏపీ లాసెట్-2023లో కొవ్వూరు హర్షవర్దన్ రాజుకు ఫస్ట్ ర్యాంకు, ప్రకాశం జిల్లాకు చెందిన గంగాధర్ కునపులి సెకండ్ ర్యాంక్, కోనసీమ జిల్లాకు చెందిన పితాని సందీప్ థార్డ్ ర్యాంక్ సాధించారు. ఐదేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీలో విశాఖపట్నంకు చెందిన మరుపల్లి రమేశ్ ఫస్ట్ ర్యాంక్, గుంటూరు జిల్లాకు చెందిన చెన్నుపాటి లిఖిత రెండో ర్యాంక్, ప్రకాశం జిల్లాకు చెందిన అలతుర్తి రవీంద్ర చారి మూడో ర్యాంకులో మెరిశారు. ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రవీంద్రబాబుకు ఫస్ట్ ర్యాంక్, ఏలూరుకు చెందిన సాయి నాగ శ్రీబాల సెకండ్ ర్యాంకు, విశాఖపట్నంకు చెందిన సాది సింధుజ రెడ్డి మూడో ర్యాంకు సాధించి టాపర్లుగా నిలిచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.