AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో మార్మోగిన అమెరికా.. ప్రవాస భారతీయుల గ్రాండ్ వెల్కమ్..

PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో అమెరికా మారుమోగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది.

PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో మార్మోగిన అమెరికా.. ప్రవాస భారతీయుల గ్రాండ్ వెల్కమ్..
Pm Modi
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jun 22, 2023 | 8:48 AM

Share

PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో అమెరికా మారుమోగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. బుధవారం వాషింగ్టన్‌లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి త్రివర్ణ పతాకాలతో ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న తర్వాత ప్రధాన మంత్రి విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని ఫ్రీడమ్ ప్లాజాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు.

మోడీని చూసిన ఆనందంలో.. జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ.. మోడీ, మోడీ, భారత్ మాతాకీ జై, వందేమాతరం అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోడీ వాషింగ్టన్ రాకను పురస్కరించుకుని ప్రధానమంత్రి స్వస్థలం గుజరాత్ కు చెందిన సంప్రదాయ నృత్యం ‘గర్బా’, ఇతర జానపద నృత్యాలు, పలు సహా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

ఇలా ప్రధాని మోడీ బస చేయనున్న హోటల్ వెలుపల ప్రవాస భారతీయులంతా సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు, ఇతర ప్రవాసులతో మాట్లాడటంతోపాటు.. ఆటోగ్రాఫ్‌లు సైతం ఇచ్చారు.

కాగా.. మోడీ రాక సందర్భంగా కూచిపూడి నృత్యకారిణి కవిత ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేము చాలా సంతోషంగా ఉన్నాము.. ఇది మరపురాని సంఘటన. మేము చాలా ఉత్సాహంగా మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాము” అని కవిత తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన