AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Wanted Monkey: ‘మోస్ట్ వాంటెడ్’ కోతి అరెస్ట్‌.. రూ.21 వేల రివార్డు అందజేత

గత రెండు వారాలుగా 20 మందిపై దాడి చేసి నానా భీభత్సం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ కోతి ఎట్టకేలకు పట్టుబడింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గురువారం సాయంత్రం (జూన్‌ 22) రెస్క్యూ టీం దీనిని బంధించారు. డ్రోన్ సాయంతో కోతిని..

Most Wanted Monkey: 'మోస్ట్ వాంటెడ్' కోతి అరెస్ట్‌.. రూ.21 వేల రివార్డు అందజేత
Monkey
Srilakshmi C
|

Updated on: Jun 23, 2023 | 7:40 AM

Share

భోపాల్‌: గత రెండు వారాలుగా 20 మందిపై దాడి చేసి నానా భీభత్సం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ కోతి ఎట్టకేలకు పట్టుబడింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గురువారం సాయంత్రం (జూన్‌ 22) రెస్క్యూ టీం దీనిని బంధించారు. డ్రోన్ సాయంతో కోతిని గుర్తించి, అనంతరం మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. ఇళ్ల చుట్టూ తిరుగుతూ గత 15 రోజులుగా దాదాపు 20 మందిపై దాడి చేసింది. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రజలకు హాని తలపెడుతున్న కోతిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని పట్టుకున్నవారికి స్థానిక అధికారులు రూ.21 వేల రివార్డు కూడా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జయిని అటవీ శాఖ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుని డ్రోన్‌ సాయంతో చాకచక్యంగా దానిని బంధించారు.

ఈ కోతిని పట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో 4 గంటలపాటు శ్రమించి కోతిని పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. ఈ క్రమంలో స్థానికులు జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేశారు. మత్తు వదిలిన తర్వాత కోతి కోపంతో రగిలిపోయింది. బోనులోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. మనుషులకు హాని తలపెడుతున్న ఈ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఈ బృందానికి రాజ్‌గఢ్ మున్సిపల్ అధికారులు రూ. 21,000 ప్రకటించారు.

ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో కోతి దాడి చేసిన ఘటనలు రికార్డయ్యాయి. కోతి ఓ వృద్ధుడిపై దాడిచేసి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడిలో వృద్ధుడి తొడపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా గతకొంతకాలంగా దేశ వ్యాప్తంగా కుక్కలు వరుస దాడులకుపాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కోతులు కూడా దాడులకు పాల్పడుతున్నాయి. జంతువులు హఠాత్తుగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.