మోదీ తనకు మంచిమిత్రుడని అన్నారు బైడెన్. భారత్-అమెరికా మైత్రీబంధం 21వ శతాబ్ధానికి చాలా ముఖ్యమన్నారు. భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలు రెండు దేశాలకే కాదు ప్రపంచానికి కూడా చాలా ముఖ్యమన్నారు బైడెన్. ఇవి తరతరాల పాటు ఉంటాయన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా, సాంకేతికపరంగా ఎన్నో మార్పుల వచ్చినప్పటికీ ఇవి నిలిచిపోతాయని పేర్కొన్నారు.