Telangana: ప్రాణం తీసిన సెల్పీ సరదా..! వాగులోపడి బీటెక్‌ విద్యార్ధి మృతి

సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా బీటెక్‌ విద్యార్ధి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో గురువారం (జూన్‌ 22) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Telangana: ప్రాణం తీసిన సెల్పీ సరదా..! వాగులోపడి బీటెక్‌ విద్యార్ధి మృతి
Btech Student Died While Taking Selfie
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2023 | 8:29 AM

హనుమకొండ: సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా బీటెక్‌ విద్యార్ధి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో గురువారం (జూన్‌ 22) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ (19) స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్‌ జాహెద్‌షా, అబ్దుల్‌ షాదాబ్‌తో కలిసి గురువారం ఉదయం బైక్‌పై కంఠాత్మకూర్‌ వాగు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ వాగులోని నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇస్మాయిల్‌ అందులో పడిపోయాడు. స్నేహితుడు నీటిలో మునిగిపోతుండటం చూసిన సయ్యద్‌ జాహెద్‌షా, అబ్దుల్‌ షాదాబ్‌ కాపాడంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు.

స్థానికులు గమనించి కాపాడేందుకు యత్నించారు. ఐతే అప్పటికే ఇస్మాయిల్‌ నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న దామెర ఎస్సై రాజేందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాడు. కాలేజీకి వెళ్లిన కొడుకు విగతజీవిగా మారడం చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.