Telangana: తొమ్మిది రోజులపాటు తెలంగాణలో 36 రైళ్ల సర్వీసులు రద్దు..! ఏయే తేదీల్లో అంటే..
పలు కారణాలరిత్య 36 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం (జూన్ 23) ప్రకటించింది. వివిధ రకాల మరమ్మతులు, భద్రతాపరమైన పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ రైళ్ల సర్వీసులు..
హైదరాబాద్: పలు కారణాలరిత్య 36 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం (జూన్ 23) ప్రకటించింది. వివిధ రకాల మరమ్మతులు, భద్రతాపరమైన పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ రైళ్ల సర్వీసులు జూన్ 25 నుంచి జులై 3 వరకు రద్దు చేసినట్లు తెలిపింది. కొన్ని రైళ్లను ఒక్కోరోజు మాత్రమే రద్దు చేశారు. మరికొన్నింటిని అన్ని రోజులు రద్దు చేశారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు 36 రైళ్లు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో తెల్పింది. కాగా గత కొంత కాలంగా పలు రైల్వే డివిజన్లలో జరుగుతున్న మరమ్మత్తు పనుల వల్ల రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏయే రోజుల్లో ఏయే రైళ్లు రద్దయ్యాయంటే..
- జూన్ 25, 26 తేదీల్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు.
- జూన్ 24, 26 తేదీల్లో కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు.
- జూన్ 26 నుంచి జులై 3 వరకు కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడిచింది.
- జూన్ 26 నుంచి జులై 2 వరకు కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.