AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Nanny: కుక్కలంటే ఇష్టమా.. కేర్ టేకర్‌గా ఉద్యోగం.. ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్‌

కోటి రూపాయల భారీ జీతం, లగ్జరీ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు.. మంచి భోజనం, వసతి ఇన్ని సదుపాయాలు కల్పించి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.  అయితే ఫెసిలిటీస్‌ కు తగిన కండిషన్స్‌ కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటాయి మరి. ఏది ఏమైనా విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి అమెరికన్ ఫ్యామిలీ ప్రకటించిన ఉద్యోగం మంచి ఆఫర్‌ అని చెప్పొచ్చు.

Dog Nanny: కుక్కలంటే ఇష్టమా.. కేర్ టేకర్‌గా ఉద్యోగం.. ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్‌
Dog Nanny
Surya Kala
|

Updated on: Jun 24, 2023 | 12:18 PM

Share

మనిషికి కుక్క అత్యంత విశ్వాసం గల జంతువు. అందుకనే కొందరు తమ పెంపుడు కుక్కలని సొంత ఇంటి పిల్లల్లా భావిస్తారు. ప్రేమిస్తారు. మరి అలంటి పెంపుడు కుక్కలపై తమ అపార ప్రేమని వ్యక్తం చేస్తూ పుట్టిన రోజు, సీమంతం, వంటి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వార్తల్లో తరచుగా నిలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా అమెరికన్ బిలియనీర్ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులను ఇష్టపడేవారి దృష్టిని ఆకర్షించింది.

కోటి రూపాయల భారీ జీతం, లగ్జరీ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు.. మంచి భోజనం, వసతి ఇన్ని సదుపాయాలు కల్పించి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.  అయితే ఫెసిలిటీస్‌ కు తగిన కండిషన్స్‌ కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటాయి మరి. ఏది ఏమైనా విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి అమెరికన్ ఫ్యామిలీ ప్రకటించిన ఉద్యోగం మంచి ఆఫర్‌ అని చెప్పొచ్చు. ఫెయిర్‌ఫాక్స్ అండ్ కెన్సింగ్టన్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ చేసిన ఉద్యోగ ప్రకటనపై పలువురు దృష్టి పడింది.

ఉద్యోగం అంటే.. కుక్కలను చూసుకోవడమే. తమ పెంపుడు కుక్కలను చూసే వారికి కోటి రూపాయల జీతం ఇస్తామని ప్రకటించారు అమెరికన్ బిలియనీర్‌.  వీరికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు ఏమి చేయాలంటే..  రోజంతా కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం 6 వారాల పాటు సెలవులు అంటే 42 రోజులు సెలవులు ఉంటాయి. కుక్కలతో కలిసి లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించొచ్చు. మంచి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఉద్యోగం చేసేవారు ఉన్నత స్థానాల్లో నివసిస్తారు. అవసరమైనప్పుడు సంపన్నులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగంలో భాగంగా వీరు కుక్కలకు ఆహారం పెట్టాలి. వాటిని టైముకి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. కుక్కల అవసరాలన్నీ తీర్చాలి.

ఇవి కూడా చదవండి

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కుక్కల గురించి బాగా తెలిసి వుండాలి. కుక్కలు తినే ఆహారం, పానీయాలపై అవగాహన ఉండాలి. కుక్కలతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. తన వ్యక్తిగత జీవితం కంటే కుక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ఉద్యోగంలో చేరాలి అనుకునేవారు తాము ఇప్పుడు ఉన్నచోట అన్నింటినీ విడిచిపెట్టి ఒకే ఒక్క కాల్‌తో ఈ సంపన్నులను చేరుకోవాల్సి ఉంటుంది.

కుటుంబం తరపున మాట్లాడుతున్న ఫెయిర్‌ఫాక్స్ అండ్ కెన్సింగ్టన్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీకి చెందిన జార్జ్ రాల్ఫ్-డన్ మాట్లాడుతూ.. అమెరికన్ బిలియనీర్ కుటుంబం ఆఫర్ చేస్తున్న మొత్తం ఇంతకు ముందు వినలేదన్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే దాదాపు రెండు వేల దరఖాస్తులు వచ్చాయని అందుకే ప్రకటన లింక్ ను తొలగించినట్లు చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..