Cobra Eggs: కింగ్ కోబ్రా గుడ్లను కృత్రిమంగా పొదిగించిన స్నేక్ క్యాచర్స్.. 25 పాము పిల్లలు అడవిలో రిలీజ్..

బిభూతి భూషణ్ దాస్ అనే వ్యక్తి రథా రోడ్ ప్రాంతంలో ఉన్న తన గోడౌన్‌లో నాగుపామును గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బందికి సంచరం అందించారు. ఈ ఘటన జూన్ 5వ తేదీన చోటు చేసుకుంది. స్నేక్ హెల్ప్‌లైన్‌కు చెందిన అరుణ్ కుమార్ బరాల్ సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా నాగుపాము, కొన్ని గుడ్లు కనిపించాయి.

Cobra Eggs: కింగ్ కోబ్రా గుడ్లను కృత్రిమంగా పొదిగించిన స్నేక్ క్యాచర్స్.. 25 పాము పిల్లలు అడవిలో రిలీజ్..
Artificial Hatching
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2023 | 1:24 PM

సైన్స్ కు సవాల్ చేస్తూ సృష్టికి ప్రతి సృష్టిని చేయడానికి మనిషి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కృతిమ గర్భంతో మరో ప్రాణికి జీవం పోస్తున్నారు వైద్యులు. పక్షుల గుడ్లను కూడా కృత్రిమంగా పొడిగించి జీవం పోస్తుండగా అప్పుడప్పుడు పాము గుడ్లకు కృత్రిమంగా పొదిగిస్తున్న సంగతి తెలిసిందే.. మళ్ళీ అరుదైన పరిణామం ఒడిశా వేదికైంది. భువనేశ్వర్‌లో కృత్రిమంగా తాచు పాము గుడ్లను పొడిగించారు. దీంతో గుడ్ల నుండి 25 కోబ్రా పిల్లలు బయటపడ్డాయి.

ఒడిశా రాజధానిలోని రథా రోడ్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం గుడ్లు పెట్టిన నాగుపామును రక్షించి అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. తర్వాత పాము పెట్టిన గుడ్లను స్నేక్ హెల్ప్‌లైన్ ద్వారా కృత్రిమంగా పెరిగేలా  ఏర్పాటు చేశారు. నగరం వెలుపల సహజ నివాస స్థలంలో.. స్నేక్ హెల్ప్‌లైన్ బృందం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ క్యాప్టివ్ బ్రీడింగ్ విజయంపై స్నేక్ హెల్ప్‌లైన్ బృందం హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.

బిభూతి భూషణ్ దాస్ అనే వ్యక్తి రథా రోడ్ ప్రాంతంలో ఉన్న తన గోడౌన్‌లో నాగుపామును గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బందికి సంచరం అందించారు. ఈ ఘటన జూన్ 5వ తేదీన చోటు చేసుకుంది. స్నేక్ హెల్ప్‌లైన్‌కు చెందిన అరుణ్ కుమార్ బరాల్ సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా నాగుపాము, కొన్ని గుడ్లు కనిపించాయి. స్నేక్ క్యాచర్ పామును రక్షించి ఒక సంచిలో ఉంచినప్పుడు..  గోడౌన్ సిబ్బంది గుడ్లను కూడా తీసుకెళ్లమని కోరారు.

ఇవి కూడా చదవండి

తాచు పామును నగరం వెలుపల ఉన్న సురక్షిత ప్రాంతంలో విడుదల చేశారు. అనంతరం పాము పెట్టిన గుడ్లు స్నేక్ హెల్ప్‌లైన్ ఆఫీసుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారు కృత్రిమంగా పొదగడానికి ఏర్పాట్లు చేశారు. గుడ్లు మంగళవారం నుండి పొదిగించడం ప్రారంభించాయి.. బుధవారం ప్రక్రియ పూర్తయింది. మొత్తం 25 గుడ్ల నుంచి పాము పిల్లలు బయటపడ్డాయని స్నేక్ హెల్ప్‌లైన్ ప్రధాన కార్యదర్శి శుభేందు మల్లిక్ తెలిపారు.

విపరీతమైన వేడిని దృష్టిలో ఉంచుకున్న అటవీ అధికారుల సమక్షంలో సాయంత్రం పాము పిల్లలను సహజ ఆవాసాలలోకి విడుదల చేశారు. సాధారణంగా పాములు పొదిగేందుకు సరైన సురక్షితమైన ప్రదేశం, ఉష్ణోగ్రత , తేమ ఉన్న ప్రదేశంలో గుడ్లు పెడతాయి. తాము పెట్టిన గుడ్లను ఇతర పాములకు ఎర కాకుండా కాపాడుకుంటూ ఇతర పాములు గుడ్లను పొదగకుండా కాపాడతాయి.

ఒక కోబ్రా గుడ్డు సాధారణంగా పొదుగడానికి 45 నుండి 60 రోజులు పడుతుంది. అయితే గుడ్లు పెట్టిన ప్రాంతం నుంచి మార్చినా, లేదా తాకినా అవి పొదుగవు. కనుక కృత్రిమంగా గుడ్లు పొదిగేందుకు అదనపు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. ప్రజలు తమ తోటలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు, పరిశుభ్రత పాటించకపోతే పరిసరాల్లో కోబ్రా లేదా కట్లపాములు పెట్టే అవకాశం పెరుగుతుందని అన్నారు. ఆలా గుడ్ల నుంచి వచ్చే పాము పిల్లల వలన పరిశరాల్లోని వారికి ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించారు. పాము గుడ్లను ధ్వంసం చేయడానికి బదులు వాటిని చూసినప్పుడు మల్లిక్ పాము హెల్ప్‌లైన్ లేదా అటవీ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..