AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opposition Meeting: అందరి టార్గెట్ ఆయనే.. పాట్నాలో కలిసిన విపక్ష నేతలు.. కానీ చివర్లో..

తమ పార్టీ సిద్దాంతాలు వేరైనా బీజేపీని ఓడించడమే ప్రస్తుతమున్న ఏకైక లక్ష్యమని చాటిచెబుతున్నారు. బీజేపీని ఓడించేందుకు ఒక్కటిగా కలిసి వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో 15కుపైగా పార్టీలు పాల్గొన్నాయి. ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా విపక్ష నేతలంతా గళం విప్పారు.

Opposition Meeting: అందరి టార్గెట్ ఆయనే.. పాట్నాలో కలిసిన విపక్ష నేతలు.. కానీ చివర్లో..
Opposition Meeting
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2023 | 4:56 PM

Share

వారందరి టార్గెట్‌ 2024లో బీజేపీని గద్దె దించడమే. అదే ప్రధాన ఎజెండాగా పాట్నాలో ఇవాళ విపక్షాలు ఏకం అయ్యాయి. ఈ భేటీలో 15కుపైగా పార్టీలు పాల్గొన్నాయి. ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా విపక్ష నేతలంతా గళం విప్పారు. తమ పార్టీ సిద్దాంతాలు వేరైనా బీజేపీని ఓడించడమే ప్రస్తుతమున్న ఏకైక లక్ష్యమని చాటిచెబుతున్నారు. బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. అదే విధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఒమర్ అబ్దుల్లా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌‌తో పాటు కమ్యూనిస్టు నేతలు కూడా కదిలివచ్చారు.

విపక్ష ఐక్య కూటమిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీని ఓడించేందుకు ఒక్కటిగా కలిసి వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సమావేశంలో ఆర్డెనెన్స్‌ అంశం కూడా చర్చకు వచ్చింది. తమ పోరాటానికి కాంగ్రెస్‌ కలిసి రావాలని ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. 2024లో బీజేపీకి చెక్‌ పెట్టాలంటే విపక్షాలన్నీ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో మొదటి అడుగు బీహార్‌లో పడింది.

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడాన్నే విపక్ష నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 80 లోక్​సభ సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశమైంది.

ఏయే నేతలు సమావేశంలో పాల్గొన్నారంటే..

  • బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
  • ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్
  • కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
  • కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
  • ఎన్సీపీ అధినేత శరద్ పవార్
  • పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
  • ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
  • జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
  • ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
  • శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే
  • తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
  • నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా
  • పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ
  • సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
  • సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

మరిన్ని జాతీయ వార్తల కోసం