Viral: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన మట్టి కుండ.. ఏముందోనని ఓపెన్ చేయగా..
ప్రాచీన నాగరికతను వెలికితీసే క్రమంలో పురావస్తు శాఖ అధికారులు తరచూ నిర్వహించే తవ్వకాల్లో అరుదైన పరికరాలు, వస్తువులు, నాణేలు వంటివి..
ప్రాచీన నాగరికతను వెలికితీసే క్రమంలో పురావస్తు శాఖ అధికారులు తరచూ నిర్వహించే తవ్వకాల్లో అరుదైన పరికరాలు, వస్తువులు, నాణేలు వంటివి బయల్పడుతున్న సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
తూత్తుకుడి జిల్లాలోని ఆదిచ్చనల్లూరు ఏరుంబు ప్రాంతంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపట్టగా.. వారిని ఆశ్చర్యపరుస్తూ తొలిసారిగా ఓ మట్టి కుండలో చిన్న పిల్లలు ధరించే కంచు గాజులు బయటపడ్డాయి. ఇవి మాత్రమే ఇనుప ఆయుధాలు, బంగారు ఆభరణాలు, కంచు వస్తువులను సైతం ఆ తవ్వకాల్లో కనుగొన్నారు. ఇనుప గాజులలో ఒక్కో గాజు సుమారు 24 గ్రాముల బరువు ఉందని తెలిపారు. కాగా, మరి కొద్దిరోజుల్లో ఏర్పాటు చేసే మ్యూజియంలో ఈ వస్తువులన్నింటినీ భద్రపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.