Watch: కేదార్‌నాథ్‌ యాత్రలో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి.. వైరలవుతున్న వీడియో..

గుర్రాల నిర్వాహకులు జంతువులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు చాలానే ఉన్నాయంటున్నారు. ఇటీవల కేదార్‌నాథ్ యాత్రకు వచ్చిన యాత్రికులపై గుర్రాల నిర్వాహకులు దాడి చేసిన ఘటన కూడా జరిగింది. కేదార్‌నాథ్ పవిత్ర క్షేత్రం ప్రస్తుతం వివాదాలు, హింస, అమానవీయ ఘటనలతో వార్తల్లో నిలవటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

Watch: కేదార్‌నాథ్‌ యాత్రలో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి.. వైరలవుతున్న వీడియో..
Horse
Follow us

|

Updated on: Jun 23, 2023 | 6:02 PM

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ యాత్రకు వెళుతున్న గుర్రానికి బలవంతంగా గంజాయి ఇచ్చిన ఘటన చోటుచేసుకుంది. గుర్రపు నిర్వాహకులు గుర్రం నోటిలో బలవంతంగా గంజాయిని వేసి, ముక్కు, నోటి గుండా పొగ పట్టిస్తున్నారు. ఇలాంటి జంతు హింసకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేదార్‌నాథ్ యాత్రలో యాత్రికులు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తారు. గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు. దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు కూడా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఈ వీడియో విడుదలైన తర్వాత జంతు హింస, యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు గుర్రపు నిర్వాహకులు గుర్రం నోటిలో గంజాయి పెట్టారు. ఆ తరువాత వారిలో ఇద్దరు గుర్రం నోరు, ముక్కును గట్టిగా మూసారు. వారు చేస్తున్న వికృత చర్యకు పాపం ఆ మూగజీవి..బెదిరిపోతుంది. కానీ, ఆ తర్వాత నెమ్మదించి గుర్రం గంజాయిని పీల్చటం కనిపించింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చేశారు. పదే పదే గుర్రానికి గంజాయి తాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలు జంతు సంరక్షణ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ వీడియో సంచలనం సృష్టించడంతో కేదార్‌నాథ్ పోలీసులు స్పందించారు. వీడియోపై విచారణ జరుపుతామని ప్రకటించారు.. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

ఇవి కూడా చదవండి

కేదార్‌నాథ్‌లో జంతువులను హింసించడం ఇది మొదటిసారి కాదు. ఇక్కడ ప్రయాణికుల రవాణా కోసం సరైన ఆరోగ్యం, కండపుష్టి లేని గుర్రాలను ఉపయోగిస్తుంటారు. వాటికి సరైన ఆహారం అందించరు. దీంతో యాత్రికులను తీసుకెళ్తుండగా అవి పలుమార్లు కిందపడిపోవటం, పలువురు యాత్రికులు గాయపడిన సంఘటనలు కూడా అనేకం జరుగుతుంటాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ గుర్రాల నిర్వాహకులు జంతువులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు చాలానే ఉన్నాయంటున్నారు. ఇటీవల కేదార్‌నాథ్ యాత్రకు వచ్చిన యాత్రికులపై గుర్రాల నిర్వాహకులు దాడి చేసిన ఘటన కూడా జరిగింది. కేదార్‌నాథ్ పవిత్ర క్షేత్రం ప్రస్తుతం వివాదాలు, హింస, అమానవీయ ఘటనలతో వార్తల్లో నిలవటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..