తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం.. భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ

ఈ సంస్థ ప్రారంభించిన తొలి ఆరు నెల‌ల్లోనే 600 మందితో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 2.8 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌తో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవ‌లందిస్తుంది. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే

తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం.. భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ
Ktr
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 9:52 PM

తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానుంది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. గత నెల యూకెలో మంత్రి కేటీఆర్‌ పర్యాటన సందర్భంగా లాయిడ్స్ గ్రూప్ సంస్థ ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. యూకేలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. త‌మ టెక్నాలజీ సెంటర్ ను త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ప్రారంభించేందుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకు వ‌చ్చిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సంస్థ ప్రారంభించిన తొలి ఆరు నెల‌ల్లోనే 600 మందితో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 2.8 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌తో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవ‌లందిస్తుంది. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్టుగా లాయిడ్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు లాయిడ్స్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి