ఏటా పెరుగుతున్న శివలింగం.. ఇక్కడి అభిషేక జలంతో సర్వరోగాలు మటుమాయం..! ఎక్కడంటే..

కేవలం చారిత్రక కారణాలు మాత్రమే కాదు. ఈ ఆలయానికి భక్తుల రద్దీ వెనుక మరో కారణం కూడా ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం కాలక్రమేణా ఎంతో ఎత్తుకు ఎదిగిందని భక్తుల విశ్వాసం. శివలింగం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదని, కానీ ఇప్పుడు అది 4 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకుంది.

ఏటా పెరుగుతున్న శివలింగం.. ఇక్కడి అభిషేక జలంతో సర్వరోగాలు మటుమాయం..! ఎక్కడంటే..
Shiva Temple Bihar
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 9:08 PM

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివలింగం ఎత్తు పెరుగుతోంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఇక్కడ శివలింగానికి అభిషేకాలు, పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే, ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు అనేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి విశేషమైన శివాలయం.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని అరా పట్టణంలో ఉంది. ఇక్కడి బుద్వా మహాదేవ్ ఆలయం దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయానికి మహాభారతంతో ప్రత్యక్ష సంబంధం ఉందని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ శివుడిని పూజించేవారని ప్రతీతి. భోజ రాజు బుద్వా ఆలయంలో మహాదేవుని పూజించేవాడని కూడా నమ్ముతారు. అయితే, ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం మీకు బహుశా తెలియకపోవచ్చు. అది మీకు తెలిస్తే, మీరు కూడా తప్పక అక్కడి ఆలయంలోని మహాదేవున్ని దర్శించుకుంటారు.

కేవలం చారిత్రక కారణాల వల్ల కాదు. ఈ ఆలయానికి భక్తుల రద్దీ వెనుక మరో కారణం కూడా ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం కాలక్రమేణా ఎంతో ఎత్తుకు ఎదిగిందని భక్తుల విశ్వాసం. శివలింగం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదని, కానీ ఇప్పుడు అది 4 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకుంది. ఆలయ పూజారి మహంత్ అజిత్ మిశ్రా తన పూర్వీకులు అనేక తరాలుగా ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారని, వారంతా శివలింగం ఎత్తు పెరగడాన్ని చూశారని చెబుతున్నారు.

అదొక్కటే కాదు. ఈ శివలింగాన్ని అభిషేకించిన జలం చర్మవ్యాధులను నయం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇది ఇక్కడకు తరలి రావడానికి మరొక కారణం. ప్రతిరోజూ వేలాది మంది శివ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ శ్రావణ మాసంలో, ముఖ్యంగా శివరాత్రి సమయంలో బుద్వా మహాదేవ్ ఆలయం అత్యంత రద్దీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బీహార్‌ను సందర్శించినట్టయితే, ఆ రాష్ట్రంలోని అరా నగరాన్ని సందర్శిస్తే, ఈ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు