Suzuki Burgman Street 125: స్టైలిష్ లుక్.. స్టన్నింగ్ ఫీచర్లు.. కొత్త స్కూటర్ కొనాలనుకొంటున్నవారికి బెస్ట్ ఆప్షన్
ఈ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 స్కూటర్ 3 డాషింగ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాక 13 కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ స్కూటర్లో శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది. 8.48 బీహెచ్‌పీతోపాటు 10 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మంచి స్కూటర్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అనువైన బడ్జెట్లో బెస్ట్ స్కూటర్ మీకు అందుబాటులో ఉంది. సుజుకీ కంపెనీకి చెందిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఇది 125సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ధర, లుక్, ఫీచర్లు, పనితీరులో దీనికి సాటి మరేది లేదనే చెప్పాలి. మైలేజీ కూడా లీటర్‌కు 48.5కిలోమీటర్లు ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
13 కలర్ ఆప్షన్‌లలో..
ఈ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 స్కూటర్ 3 డాషింగ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాక 13 కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ స్కూటర్లో శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది. 8.48 బీహెచ్‌పీతోపాటు 10 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఈ స్కూటర్‌లో 5.5-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. ఇది బోల్డ్ లుక్‌లో ఆకట్టుకుంటుంది. స్కూటర్ బరువు 111 కిలోలు మాత్రమే. దీనిని నడపడం, నియంత్రించడం చాలా సులభం. సుజుకి కంపెనీ దీనిని మాక్సీ-స్కూటర్ కాన్సెప్ట్‌తో తయారు చేసింది. ఇది చాలా సౌకర్యవంతమైన సింగిల్ సీటుతో వస్తుంది.
స్టైలిష్ లుక్..
ఈ సుజుకీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంది. దీనికి పెద్ద బాడీ ప్యానల్స్ ఇచ్చారు. ఎల్‌ఈడీ లైట్లు, పెద్ద ఫ్లోర్ బోర్డు, సీట్ లైనింగ్‌లు ఇచ్చారు.కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది.



ఈఎంఐల రూపంలో..
ఈ స్కూటర్ మార్కెట్‌లో రూ. 108,351 లక్షల నుంచి రూ. 132,604 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలతో అందుబాటులో ఉంది. అయితే కేవలం రూ. 11,000 డౌన్ పేమెంట్‌తో దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు 9.7 శాతం వడ్డీ రేటు ప్రకారం మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.3186 చెల్లించాలి. డౌన్ పేమెంట్ ప్రకారం నెలవారీ వాయిదాను మార్చుకోవచ్చు. దాని లోన్ పథకంపై మరిన్ని వివరాల కోసం, మీరు సమీపంలోని సుజుకి డీలర్‌షిప్‌ను సందర్శించాలి.
సూపర్ ఫీచర్లు..
స్కూటర్‌లో సుజుకి రైడ్ కనెక్ట్ అప్లికేషన్, నావిగేషన్, కాల్ అలర్ట్, కాలర్ ఐడి, ఫోన్ బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మార్కెట్లో ఉన్న ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 లతో పోటీపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..