Run Raja Run: ‘రన్ రాజా రన్’ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది ?.. అంతలోనే ఎంత మార్పు..
టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సీరత్ కపూర్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది.

సినీరంగంలో అనేక మంది అందాల తారలు అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారున్నారు. అలాగే ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైనవారు ఉన్నారు. ఆ జాబితాలో సీరత్ కపూర్ ఒకరు. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది..కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందామా.
టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సీరత్ కపూర్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.




అయితే ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. ఇక ఇటీవల హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా. బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




