Adipurush: ఆదిపురుష్ వివాదం పై స్పందించిన హైకోర్టు.. ఏమని తీర్పునిచ్చిందంటే..
ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా.. మరోవైపు నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా.. మరోవైపు నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ సినిమాపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదే పిటిషన్ పై జూన్ 30న విచారణకు రావాలని ఆదేశించింది. సినిమా ఇప్పటికే విడుదలైందని.. రిలీజ్ డేట్ కూడా ముందుగానే తెలుసు అని ఆ సమయంలో అత్యవసర విచారణ కోసం ఎలాంటి కేసు పెట్టలేదని కోర్టు పేర్కొంది.
పిటిషనల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. నేపాల్ ఈ సినిమాను నిషేధించినందున అంతర్జాతీయ సంబంధాలకు ఆటంకం కలిగించే విధంగా ఈ సినిమాలో అనేక వివాదాస్పద భాగాలు ఉన్నాయని.. అయితే విడుదలకు ముందే ఆ సన్నివేశాలను తొలగిస్తామని డైరెక్టర్ ఓంరౌత్ చెప్పారని.. కానీ అలా చేయకుండా నేరుగా ఈ సినిమాను విడుదల చేశారని అన్నారు. వాల్కీకి, తులసీదాస్ వంటి రచయితలు రచించిన రామయాణం కాకుండా.. ఆదిపురుష్ అంటూ అనుచితమైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని.. ఈ మేరకు అత్యవసర విచారణ జరపాలని హిందూ సేన లాయర్ కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.
ఇదిలా ఉంటే.. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటీనటులు ఆదిపురుష్ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రామాయణాన్ని డైరెక్టర్ ఓంరౌత్ అపహాస్యం చేశారని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఓవైపు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతుండగా.. మరోవైపు సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




