AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie: కథ విన్న 10 నిమిషాలకే చాలా నచ్చింది.. OG సినిమాపై శ్రియారెడ్డి కామెంట్స్..

సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హాష్మీ ప్రతినాయకుడిగా నటించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో పొగరు ఫేమ్ శ్రియా రెడ్డి కీలకపాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె ఓజీ సెట్ లో అడుగుపెట్టింది.

OG Movie: కథ విన్న 10 నిమిషాలకే చాలా నచ్చింది.. OG సినిమాపై శ్రియారెడ్డి కామెంట్స్..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2023 | 5:33 PM

Share

పవన్ కళ్యాణ్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఓవైపు చేతి నిండా సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు పవన్. ఇప్పుడు ఆయన నటిస్తోన్న సినిమాల్లో భారీగా అంచనాలు నెలకొన్న సినిమా ఓజీ. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హాష్మీ ప్రతినాయకుడిగా నటించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో పొగరు ఫేమ్ శ్రియా రెడ్డి కీలకపాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె ఓజీ సెట్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియారెడ్డి ఓజీ, సలార్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

“డైరెక్టర్ సుజిత్ వచ్చి కథ చెప్తా అన్నప్పుడు కమర్షియల్ సినిమా అయి ఉంటుంది. నో చెప్పాలని అనుకున్నాను. కానీ కథ విన్న మొదటి పది నిమిషాలకే నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాకు ఓకే చెప్పాను. పవన్ గారిని సెట్ లో మొదటి రోజు చూసినప్పుడు అలాగే ఉండిపోయాను. పవన్ గారు చాలా అందంగా ఉంటారు. నా వద్దకు వచ్చి షేక్ హ్యండ్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. చాలా హంబుల్ గా ఉంటారు. ఇక ఓజీ సినిమా మాత్రం అదిరిపోతుంది” అని అన్నారు.

పవన్ గారు ఫుల్ మాస్.. చాలా పర్ఫెక్ట్ గా ఆయన స్పీచ్ లు ఉంటాయి. సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయనది చాలా మంచి మనసు. ఆయనకు ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఓజీ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా