Varun Sandesh: షూటింగ్‏లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్..  కాలుకు బలమైన గాయం.. 

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని.. పరీక్షించిన వైద్యులు 3 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వెల్లడించింది. దీంతో ది కానిస్టేబుల్ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Varun Sandesh: షూటింగ్‏లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్..  కాలుకు బలమైన గాయం.. 
Varun Sandesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2023 | 8:42 PM

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్‏ షూటింగ్ లో గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ది కానిస్టేబుల్ సినిమాలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. బుధవారం షూటింగ్‏లో వరుణ్ కాలుకు బలమైన గాయమైనట్లుగా చిత్రబృందం తెలిపింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని.. పరీక్షించిన వైద్యులు 3 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వెల్లడించింది. దీంతో ది కానిస్టేబుల్ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

2007లో హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు వరుణ్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో విజయాన్ని అందుకున్నాడు వరుణ్. అయితే ఆ తర్వాత స్టోరీ ఎంపికలో పొరపాట్లతో వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ పోషించారు వరుణ్. అలాగే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ది కానిస్టేబుల్ సినిమానే కాకుండా.. యద్భావం తద్భవతి చిత్రంలోనూ నటిస్తున్నారు.