Devara: ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్ లీక్ చేసిన నటుడు.. ఎన్టీఆర్ మూవీలో దసరా విలన్..
చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ మూవీతో రాబోతుండడంతో ఈ మూవీపై హైప్ ఎక్కువగానే ఉంది.. దీంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ. అందుకే ఈ సినిమాపై జాన్వీ సైతం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ మూవీతో రాబోతుండడంతో ఈ మూవీపై హైప్ ఎక్కువగానే ఉంది.. దీంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ. అందుకే ఈ సినిమాపై జాన్వీ సైతం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ లీక్ చేశారు మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో. దేవర చిత్రంలో ఆయన కీలకపాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన ఇన్ స్టా స్టోరీతో అనౌన్స్ చేశాడు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. షైన్ టామ్ చాకో మరో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దేవర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.





Shine Tom Chacko
న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు షైన్ టామ్ చాకో. ఈ సినిమాతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం నాగశౌర్య నటిస్తోన్న రంగబలి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దేవర చిత్రంలోనూ నటించనున్నారని పరొక్షంగా తెలిపారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.