AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Dance Video: మళ్లీ పుట్టిన మైఖేల్‌ జాక్సన్‌..! డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. అతడు ఎవరో కాదు..

ప్రస్తుతం, అతను తన అద్భుతమైన ప్రదర్శనల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ నెటిజన్లను అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటికే బాబా జాక్సన్‌ డ్యాన్స్ వైరల్‌ వీడియోకు1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో వేల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాదు..వీడియో చూసిన ప్రతిఒక్కరూ తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Viral Dance Video: మళ్లీ పుట్టిన మైఖేల్‌ జాక్సన్‌..! డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. అతడు ఎవరో కాదు..
Boy Dancing Like Michael Ja
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2023 | 4:43 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు చాలా మంది రాత్రికి రాత్రే పాపులర్‌ అయిపోతున్నారు. కొందరు వంటలు చేస్తూ, కొందరు బాగా భోజనం చేస్తూ.. ఇంకొందరు చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తుంటారు. మరికొందరు రిల్స్‌ కోసం డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియాను తమ వైపుకు తిప్పుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి మైఖేల్ జాక్సన్‌ను మరిపించేలా డ్యాన్స్ చేస్తున్నాడు. అతనితో పాటుగా కొందరు అమ్మాయిల బృందం కూడా ఉంది. వారు వేసే స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. వారి స్టైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ అబ్బాయిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటున్నారు.

పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని డ్యాన్స్‌ స్టైల్‌ నుంచి డ్రెస్‌ల వరకు ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. జాక్సన్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ చాలా మంది వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో క్లిప్ బయటకు వచ్చింది. ఇందులో ఒక యువకుడు మైఖేల్‌ జాక్సన్ లాగా డ్యాన్స్‌ చేస్తూ చూపిస్తున్నాడు. ఈ వీడియోని మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ‘ఫన్ వైరల్ విడ్స్’ (@Fun_Viral_Vids) పేరుతో ఉన్న ఖాతాలో పోస్ట్ చేయగా, క్యాప్షన్‌లో ఈ అబ్బాయి మైఖేల్ జాక్సన్ మించిన మైఖేల్ జాక్సన్ అంటూ రాశారు.

ఇవి కూడా చదవండి

40 సెకన్ల నిడివి గల వీడియోలో అక్కడి స్థానిక మురికివాడల ముందు సూటు-బూటు ధరించి ఒక యువకుడు డ్యాన్స్ చేయడం చూడవచ్చు. అతనితో పాటు మరో ఆరుగురు అమ్మాయిలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు. వారు అతనితో పాటే పర్ఫెక్ట్‌గా డ్యాన్స్‌ చేస్తున్నారు. ఎమ్‌జే పాట ‘డేంజరస్’పై డ్యాన్స్ చేసిన యువకుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాడు. అతని డ్యాన్స్‌ చేసే విధానం, బాడీ మూవ్‌మెంట్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ కొరియోగ్రఫీని తెగ ప్రశంసిస్తున్నారు.

అయితే, ఆ అబ్బాయి మరెవరో కాదు..బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్‌లకు తన ప్రతిభను ప్రదర్శించి వారి ప్రశంసలు అందుకున్న ప్రముఖ డ్యాన్సర్ బాబా జాక్సన్ అని తెలిసింది. ప్రస్తుతం, అతను తన అద్భుతమైన ప్రదర్శనల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ నెటిజన్లను అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటికే బాబా జాక్సన్‌ డ్యాన్స్ వైరల్‌ వీడియోకు1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో వేల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాదు..వీడియో చూసిన ప్రతిఒక్కరూ తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..