Viral Video: ఇదేం కక్కుర్తి.! ఫోటో కోసం ముద్దు పెట్టుకోమంటే.. వరుడు ఏం చేశాడో మీరే చూడండి..
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ జరిగే ఈ మధురమైన ఘట్టాన్ని.. కొందరు ఎప్పుడూ గుర్తుండిపోయేలా కెమెరాలలో భద్రపరుచుకుంటారు.
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ జరిగే ఈ మధురమైన ఘట్టాన్ని.. కొందరు ఎప్పుడూ గుర్తుండిపోయేలా కెమెరాలలో భద్రపరుచుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లు ఎక్కువైపోయాయి. ఇక అలాంటిదే పెళ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులను ముద్దు పెట్టుకుంటున్నట్లు స్టిల్ ఇమ్మన్నాడు ఫోటోగ్రాఫర్. దీంతో ఆ ఇద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నారు. కొంచెం సేపటి తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏదో చెబుతున్నా కూడా ఆ ఇద్దరూ వినిపించుకోలేదు. వధూవరులు తన్మయత్వంలో మునిగిపోయి మరీ ముద్దులాడేసుకున్నారు. దీంతో వారి చర్యకు ఫోటోగ్రాఫర్ కాస్తా బిత్తరపోయాడు. చుట్టూ అందరూ చూస్తుండటంతో చేసేదేమీలేక ఆ ఫోటోగ్రాఫరే కొంచెం ధైర్యం తెచ్చుకుని.. వధూవరుల కిస్సింగ్ సీన్‌కు తెరదించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram