గుప్పెడంత గుండెకు గోంగూర.. వారానికి 2రోజులు తింటే చాలు.. వ్యాధులన్నీ మాయం..!
పుల్లటి గోంగూర ఆకుల్లో ఉండే అధిక పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి బీపీ నియంత్రణలో ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గోంగూర దీనిని పుంటికూర అని కూడా అంటారు. పుల్ల పుల్లటి ఈ పుంటికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? పుంటికూరలో మనిషి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయి. పుంటికూర తింటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్ టాక్సిన్స్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. పుంటికూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపునే ఆ నీటిని తాగటం వల్ల కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.
పుల్లటి గోంగూర ఆకుల్లో ఉండే అధిక పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి బీపీ నియంత్రణలో ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
గోంగూరలో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా మందగిస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకట్టపడుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. సోడియం, ఫాస్పరస్, క్లోరోఫిల్స్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ గోంగూర ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టు సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పుంటికూర డ్యామేజ్ అయిన, డల్, డ్రై హెయిర్‌ని రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..