Dry Fruits: రాత్రివేళ డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? మరి ఎప్పుడు తినాలి..? తెలుసుకుందాం రండి..
Right Time To Eat Dry Fruits: మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో, దానికి అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదం, వాల్నట్స్, పిస్తా పప్పులు వంటి పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో శరీరానికి కావలసిన..
Right Time To Eat Dry Fruits: మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో, దానికి అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదం, వాల్నట్స్, పిస్తా పప్పులు వంటి పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరానికి చాలా అవసరమైనవి. పైగా వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించి గుండె సంబంధిత సమస్యలను నిరోధిస్తుంది.
అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన డ్రై ఫ్రూట్స్‌ను తినే విషయంలో సరైన పద్ధతి, సమయం చాలా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. తినకూడని సమయంలో తింటే అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని, ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే తినడం మంచిదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో లేదా పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌ని అసలు తినకూడదని చెబుతున్నారు. అసలు రాత్రి వేళ వీటిని తింటే కలిగే సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..
శరీర ఉష్ణోగ్రత: డ్రై ఫ్రూట్స్ వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగానే రాత్రిపూట ఎక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తిన్న వారి శరీరంలో శరీర ఉష్ణోగ్రతను పెరుతుంది. ఇంకా శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
బరువు సమస్య: అధిక మొత్తంలో పోషకాలను కలిగిన డ్రైఫ్రూట్స్‌ని తింటే బరువు సమస్య ఎదురవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు తింటే శరీరం వీటిని ఆరగించిుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా బరువు సమస్య ఎదువుతుంది.
కడుపు సమస్యలు: నిద్రించే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. కడుపులో వేడి పుట్టించి, కడుపు నొప్పి, మల బద్ధకం, అజీర్తి సమస్యలు వెంటాయడుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..