Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: నల్ల మచ్చలు, మొటిమలతో విసిగిపోయారా..? టమోటాలను ఇలా ఉపయోగిస్తే, సమస్యకు చెక్ పెట్టినట్లే..

Tomatoes For Skincare: ప్రస్తుత కాలంలో మనం పాటించే ఆహారపు ఆలవాట్లు, జీవనశైలి అనేక విధాలుగా మన ఆరోగ్యం ప్రభావితం చూపుతుంది. చర్మ సమస్యలు కూడా వాటిలో భాగమే. అవును, ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి,,

Skincare: నల్ల మచ్చలు, మొటిమలతో విసిగిపోయారా..? టమోటాలను ఇలా ఉపయోగిస్తే, సమస్యకు చెక్ పెట్టినట్లే..
Tomatoes For Skincare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 23, 2023 | 12:23 PM

Tomatoes For Skincare: ప్రస్తుత కాలంలో మనం పాటించే ఆహారపు ఆలవాట్లు, జీవనశైలి అనేక విధాలుగా మన ఆరోగ్యం ప్రభావితం చూపుతుంది. చర్మ సమస్యలు కూడా వాటిలో భాగమే. అవును, ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి కారణంగా మొటిమలు, ముఖంపై మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయి. ఇంకా తెలిసీ తెలియక వాడే కాస్మటిక్స్ ఈ సమస్యలు పెరగడానికి మరో కారణంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చర్మ సంరక్షణ కోసం నిపుణులు పలు రకాల కీలక సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కెమికల్స్‌తో కూడిన కాస్మటిక్స్ కంటే సహజ పద్ధతులను అవలంభించమని చెబుతున్నారు. చర్మ సంరక్షణకు ఉపయోగకరమైన పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయని, ముఖ్యంగా టమోటాతో ఈ చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. టమోటాలోని యాంటి ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఈ పనిలో మనకు సహకరిస్తాయట. మరి చర్మాన్ని కాపాడుకోవడం కోసం టమోటాలను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టమోటా రసం: ముఖంపై మచ్చలు, మొటిమలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి టమోటా రసాన్ని ఉపయోగించవచ్చు. అందుకోసం ఒక గిన్నెలో టమోటా రసం తీసుకుని, కాటన్ సహాయంతో మీ ముఖంపై అప్లై చేయాలి. కనీసం 5 నిముషాల పాటు టమోటా రసంతోనే ముఖంపై మసాజ్ చేయండి. 10 లేదా 15 నిముషాల తర్వాత కడిగేయండి. వారంలో రెండు సార్లు ఇలా నెల రోజుల పాటు చేస్తే మీ సమస్యకు చెక్ పెట్టేసినట్లే.

పెరుగు, టమోటా మిశ్రమం: పాలతోనే కాదు, పాల ఉత్పత్తులు కూడా చర్మాన్ని కాపాడగలవు. ఇందుకోసం మీరు టమోటా రసంతో పెరుగుని కలిపి ముఖంపై అప్లై చేస్తే సరిపోతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్, ఇంకా ఇతర మంచి బ్యాక్టీరియాలు మీ చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

టమోటా, తేనె మిశ్రమం: తేనెలోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలకు ముఖంపై మొటిమలను నివారించే శక్తి ఉంది. టమోటాలోని యాంటి ఆక్సిడెంట్లు, తేనెలోని లక్షణాలు కలిసి ముఖంపై మచ్చలు పోవడమే కాక నిగారింపైన చర్మానికి దారి తీస్తాయి. ఇందుకోసం మీరు టమోటా రసం, తేనెలను కలిపి ముఖంపై అప్లై చేయండి. 15 నిముసాల తర్వాత కడిగేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..