PM Modi in US Congress: అమెరికన్ కాన్సులేట్‌లో మోదీ క్రేజ్ నెక్ట్స్ లెవల్.. వీడియో చూస్తే అవాక్కవుతారు..
అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు.
అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు. అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్‌ఐలు ఉన్నారన్న ఆయన.. ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు.
ప్రపంచశాంతి కోసం భారత్-అమెరికా దేశాలు కృషి చేస్తునట్టు తెలిపారు ప్రధాని మోదీ. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అన్నారు పీఎం. మోదీ తనకు మంచి మిత్రుడని అన్నారు బైడెన్. భారత్-అమెరికా మైత్రీబంధం 21వ శతాబ్ధానికి చాలా ముఖ్యమన్నారు. భారత్ – అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు ప్రపంచానికి కూడా చాలా కీలకం అన్నారు బైడెన్. ఇవి తరతరాల పాటు నిలిచిఉంటాయన్నారాయన.
ఇక ఈ వైట్‌హౌస్ విందుకు మెక్రోసాఫ్ట్ CEO సుందర్ పిచాయ్, గూగుల్ CEO సత్య నాదేళ్ల, Adobe’s CEO శాంతను నారాయణ హాజరైయ్యారు.. ఈ విందులో భారతదేశానికి చెందిన ప్రముఖులతో పాటు బడా వ్యపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మోదీ విందును ఆశ్వాదించారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మోదీ ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యులు.. 15సార్లు లేచి నిలబడి అభినందించగా.. 79 సార్లు చప్పట్లతో అభినందించారు. అయితే, ప్రసంగం తర్వాత ప్రధాని మోదీతో ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకోవడానికి కాంగ్రెస్ సభ్యులు ఆసక్తికనబరిచారు. ఆయన చుట్టూ గుమిగూడారు. ఇక ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ సంయుక్త సెషన్ చిరునామా బుక్‌లెట్‌పై మోదీ ఆటోగ్రాఫ్ చేయడం హైలెట్ అయ్యింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..