Heart Attack: ఆగుతున్న గుప్పెడంత గుండెలు.. పదేళ్లకే గుండెపోటు.. నిద్రలోనే మృతి..

గత కొంతకాలంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతుండగా.. ముఖ్యంగా గుండెపోటుబారిన పడుతున్నారు. ఆడుతూ, పాడుతూ, కారులో డ్రైవింగ్ చేస్తూ ఇలా రకరకాల సందర్భాల్లో యువతీ యువకులు గుండెపోటుకు గురై మృత్యుపాలవుతున్నారు. తాజాగా ఓ ఏడేళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Heart Attack: ఆగుతున్న గుప్పెడంత గుండెలు.. పదేళ్లకే గుండెపోటు.. నిద్రలోనే మృతి..
Heart Attack
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2023 | 10:48 AM

మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. తినే ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ అన్ని విషయాల్లో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మరింతగా శారీరక మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. గత కొంతకాలంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతుండగా.. ముఖ్యంగా గుండెపోటుబారిన పడుతున్నారు. ఆడుతూ, పాడుతూ, కారులో డ్రైవింగ్ చేస్తూ ఇలా రకరకాల సందర్భాల్లో యువతీ యువకులు గుండెపోటుకు గురై మృత్యుపాలవుతున్నారు. తాజాగా ఓ ఏడేళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

భింద్‌ జిల్లా పదేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందడం డాక్టర్లను సైతం షాక్‌కి గురి చేసింది. కిన్నౌటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్వాలియర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రాథమిక పరీక్షలో గుండెపోటు కారణంగా మరణానికి కారణమని తెలుస్తోంది, అయితే బాలుడు మరణానికి గల కారణాలను నిర్ధారించడానికి పూర్తి విచారణ అవసరమని వైద్యులు తెలిపారు.

ఈ ఘటన భింద్ జిల్లాలోని కిన్నౌటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సుఖరామ్ దౌహరే కుమారుడు 10 ఏళ్ల సాహిర్ నిద్రిస్తున్నప్పుడు ఛాతీ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే సాహిర్ ను సమీపంలోని శిశు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎన్‌ఐసీయూలో చికిత్స ఇచ్చారు. అయినప్పటికీ సాహిర్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో గ్వాలియర్‌కు తరలించి మెరుగైన చికిత్స కోసం అందించాలని భావించి.. గ్వాలియర్‌కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మెహగావ్ సమీపంలో మరణించాడు.

ఇవి కూడా చదవండి

 ప్రాధమిక విచారణలో గుండెపోటుగా నిర్ధారణ.. 

జిల్లా దవాఖానకు చెందిన డాక్టర్ ఆర్కే అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక పరీక్షల ఆధారంగా సాహిర్‌కు గుండెపోటు వచ్చినట్లు తేలిందని పేర్కొన్నారు. అయితే మరింత పరీక్షలు చేసి మరణానికి గల కారణాలను చెప్పవచ్చు అని అన్నారు. అంతేకాదు గత కొంతకాలంగా చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.. దీనికి ప్రధాన కారణం జీవన శైలి, ఆహారపుటలవాట్లు అని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..