AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaputra: చైనాకు భారత్ చెక్.. బ్రహ్మపుత్ర నది కింద భారత్ సొరంగం నిర్మాణం.. LACకి సైన్యం వేగంగా చేరుకునే వీలు

భారత దేశం నిర్మిస్తున్న సొరంగం కారణంగా, NH37 లో ట్రాఫిక్ తగ్గిపోతుంది. ప్రజలు సుఖంగా ప్రయాణం చేయవచ్చు. చైనా సరిహద్దు ప్రాంతమమైన అరుణాచల్ ప్రదేశ్‌కు సొరంగం ద్వారా దళాలను ఈజీగా తరలించవచ్చు. వస్తువులను వేగంగా బదిలీ చేయవచ్చు. దీని వల్ల దేశ భద్రత పెరుగుతుంది.

Brahmaputra: చైనాకు భారత్ చెక్.. బ్రహ్మపుత్ర నది కింద భారత్ సొరంగం నిర్మాణం.. LACకి సైన్యం వేగంగా చేరుకునే వీలు
Brahmaputra River
Surya Kala
|

Updated on: Jun 26, 2023 | 1:09 PM

Share

పొరుగు దేశమైన చైనా ఎల్లపుడూ భారతను అస్థిర పరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.. ఇక భారత చైనా  సరిహద్దుల వద్ద సృష్టించే అలజడిని ఎదుర్కోవడానికి.. భారతదేశం LAC ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. LAC వద్దకు భారత దళాలను వేగంగా తరలించడానికి బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గోహ్‌పూర్, నుమాలిఘర్ మధ్య ప్రతిపాదిత 35 కి.మీ పొడవైన కారిడార్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ని సిద్ధం చేయనున్నది. ఈ కారిడార్ నిర్మాణం కోసం జూలై 4 న సాంకేతిక బిడ్‌లను తెరవనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

సరిహద్దు ప్రాంతాలకు సులభంగా ప్రయాణించే వీలుగా  వివిధ సొరంగాల ద్వారా రోడ్డు, రైలు ట్రాక్‌లను నిర్మిస్తామని సీఎం శర్మ చెప్పారు. కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 6,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటికే ప్రధాని మోడీ ఆమోదం తెలపడంతో త్వరలో పట్టాలెక్కించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నుమాలిగఢ్ నుండి గోహ్పూర్ మధ్య దూరం దాదాపు 220 కి.మీలు.. ఈ మార్గంలో ప్రయాణించాలంటే దాదాపు 6 గంటల సమయం పడుతుంది. అయితే సొరంగాన్ని నిమిస్తే.. ప్రయాణ దూరం సుమారు 33 కి.మీ తగ్గుతుంది. అంతేకాదు ప్రయాణించే సమయం తగ్గుతుంది.

ఇక సొరంగాన్ని నిర్మిస్తే.. జాతీయ రహదారి 37లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గి.. ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా కాజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌కు దక్షిణంగా ఉన్న NH37లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ నుండి ఉపశమనం లభిస్తుంది. రవాణా సమయం కూడా తగ్గడంతో పాటు ప్రజలు సులభంగా ప్రయాణించవచ్చు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లూయిస్ బెర్గర్ అనే నిపుణులైన కన్సల్టెంట్ బ్రహ్మ పుత్ర నదిలో నిర్మించనున్న ఈ సొరంగం కోసం పలు అధ్యయనాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సొరంగంతో పెరిగే దేశ భద్రత 

ఈ సొరంగ నిర్మాణం పూర్తి అయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దేశ భద్రత మరింత పటిష్ట స్థితికి చేరుకుంటుంది. చైనాకు సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ కు సరిహద్దు వద్దకు ఈజీగా జవాన్లు చేరుకోవచ్చు. అంతేకాదు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వేగవంతంగా ఆర్మీకి కావాల్సిన భద్రతా వస్తువులను, వాహనాలను , వస్తువులను ఈజీగా తరలించవచ్చు. తద్వారా దేశ భద్రత మరింత పెరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..