Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhairav Baba Temple: నా చెప్పులు గుళ్లో పోయాయి.. కష్టపడి సంపాదించి కొనుకున్నా.. వెతికిపెట్టండి అంటూ పోలీసులకు ఫిర్యాదు..

చెప్పులు చోరీకి గురైన సంఘటన సివిల్ లైన్‌లోని భైరవ బాబా ఆలయంలో జరిగింది. దబౌలి ప్రాంతానికి చెందిన కాంతిలాల్ నిగమ్ ఆదివారం ఉదయం ఆలయంలో దేవుడి దర్శనం కోసం వెళ్ళాడు. ఆలయ సమీపంలోని ఓ దుకాణం నుంచి పూజ సామగ్రిని తీసుకెళ్లాడు. చెప్పులను గుడి బయట విడిచాడు. పూజలు ముగించుకుని తిరిగి దుకాణానికి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉంచిన చెప్పులు అపహరణకు గురయ్యాయి.

Bhairav Baba Temple: నా చెప్పులు గుళ్లో పోయాయి.. కష్టపడి సంపాదించి కొనుకున్నా.. వెతికిపెట్టండి అంటూ పోలీసులకు ఫిర్యాదు..
Slippers Stolen
Follow us
Surya Kala

|

Updated on: Jul 10, 2023 | 8:59 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. గుడి బయట ఉన్న ఓ వ్యక్తి చెప్పులు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చెప్పులు చోరీకి గురయ్యాయని బాధితుడు చెప్పాడు. చెప్పుల సైజ్ 7,  నీలం రంగులో ఉంటాయి. ఆక్యుప్రెషర్‌ కలిగి ఉన్న తన చెప్పుల దొంగతనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోమని కోరాడు. తన చెప్పులు త్వరగా కనుగొనాలని, నిందితుడైన దొంగను కూడా అరెస్టు చేయాలని ఆ వ్యక్తి పోలీసులను కోరాడు. ఇందుకోసం చెప్పుల చోరీపై పోలీసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు.

చెప్పులు చోరీకి గురైన సంఘటన సివిల్ లైన్‌లోని భైరవ బాబా ఆలయంలో జరిగింది. దబౌలి ప్రాంతానికి చెందిన కాంతిలాల్ నిగమ్ ఆదివారం ఉదయం ఆలయంలో దేవుడి దర్శనం కోసం వెళ్ళాడు. ఆలయ సమీపంలోని ఓ దుకాణం నుంచి పూజ సామగ్రిని తీసుకెళ్లాడు. చెప్పులను గుడి బయట విడిచాడు. పూజలు ముగించుకుని తిరిగి దుకాణానికి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉంచిన చెప్పులు అపహరణకు గురయ్యాయి.

ఇది చూసి కాంతిలాల్ షాక్ తిన్నాడు. పక్కనే ఉన్న చెప్పులన్నిటిని వెతికాడు.. చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా అడిగాడు. అయితే చెప్పుల జాడ దొరకలేదు. దీని తరువాత కాంతిలాల్ చెప్పుల దొంగతనానికి సంబంధించి కాన్పూర్ పోలీసుల ఇ-పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బుతో చెప్పులు కొన్నా  తాను కష్టపడి నిజాయితీగా సంపాదించి డబ్బుతో రెండు రోజుల క్రితం ఈ చెప్పులు కొన్నానని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. ఈ చెప్పులు నీలం రంగులో ఉంటాయి.. ఆక్యుప్రెషర్స్ ఉన్నాయి. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించిందని అన్నారు. తాను సమాజం పట్ల బాధ్యత కలిగియున్న పౌరుడైనందున ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని.. నిందితుడిపై  చర్యలు తీసుకోవాలని,  నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నానని పేర్కొన్నాడు.

ఇలాంటి చోరీలతో ఇతరులు ఇబ్బంది పడకూడదని అందుకే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంతిలాల్ నిగమ్ ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి తరచుగా వస్తుంటాడు.

దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు  ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. దొంగతనం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని అంటున్నారు. దొంగతనం జరిగితే కేసు నమోదు చేయడం అందరి హక్కు. నేరాన్ని నేరంగా చూస్తారు. చెప్పుల చోరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. చెప్పు దొంగిలించబడిన వ్యక్తి. చెప్పుల కొనుగోలు బిల్లు అడిగారు. దొంగను పట్టుకోవడంతో పాటు చెప్పుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..