Viral Video: బ్యాంక్‌కు తాళం వేయడం మర్చిపోయిన ఉద్యోగులు.. తెల్లారేసరికి..? వీడియో..
ఉదయం నుంచి బ్యాంకు పనులతో సతమతమైన ఉద్యోగులు.. ఇంటికెళ్ళే సమయంలో తాళం వేయడం మర్చిపోయి స్టాఫ్ అంతా వెళ్లిపోయారు. సాయంత్రం నుంచి బ్యాంక్ అలానే తెరుచుకుని ఉంది.. రాత్రి 9 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటంతో..
ఉదయం నుంచి బ్యాంకు పనులతో సతమతమైన ఉద్యోగులు.. ఇంటికెళ్ళే సమయంలో తాళం వేయడం మర్చిపోయి స్టాఫ్ అంతా వెళ్లిపోయారు. సాయంత్రం నుంచి బ్యాంక్ అలానే తెరుచుకుని ఉంది.. రాత్రి 9 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటంతో.. లోపలకు వెళ్లి చెక్ చేశారు. లోపల ఎవరూ సిబ్బంది లేకపోవడంతో వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారమిచ్చారు. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఇందుకు బాధ్యలులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
రామనాధపురం జిల్లాలోని పోతకవయాల్ గ్రామంలో వ్యవసాయ సహకార బ్యాంక్ ఉంది. జూలై 1న బ్యాంకు సిబ్బంది లాక్ చేయకుండా వెళ్లిపోవడంతో బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. దాంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని, అంతా చెక్ చేసి ఆపై బ్యాంకుకు తాళం వేసి వెళ్లారు. అయితే మర్నాడు ఉదయం బ్యాంకు సిబ్బంది విధులకు వచ్చేసరికి బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు ఖాతాదారులు. బ్యాంకుకు తాళం వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...