Guinness World Record: రికార్డుల కోసం ఏడిస్తే.. కంటి చూపు పోగొట్టుకుని నిజంగానే ఏడ్చేశాడు

గిన్నీస్‌ రికార్డు కోసం ఏకధాటిగా ఏడు రోజులు ఏడ్చి రికార్డు సృష్టించే ప్రయత్నంలో నైజీరియా యువకుడు కంటి చూపు కోల్పోయాడు. 93 గంటల 11 నిమిషాల పాటు క్రైయింగ్‌ మారథాన్‌తో నైజీరియాకు చెందిన టెంబు ఎబెరే గిన్నీస్ రికార్డు సృస్టించిన..

Guinness World Record: రికార్డుల కోసం ఏడిస్తే.. కంటి చూపు పోగొట్టుకుని నిజంగానే ఏడ్చేశాడు
Nigerian Man Continuously Crying For 7 Days
Follow us

|

Updated on: Jul 26, 2023 | 10:08 AM

అబుజా, జూలై 25: గిన్నీస్‌ రికార్డు కోసం ఏకధాటిగా ఏడు రోజులు ఏడ్చి రికార్డు సృష్టించే ప్రయత్నంలో నైజీరియా యువకుడు కంటి చూపు కోల్పోయాడు. 93 గంటల 11 నిమిషాల పాటు క్రైయింగ్‌ మారథాన్‌తో నైజీరియాకు చెందిన టెంబు ఎబెరే గిన్నీస్ రికార్డు సృస్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు కోసం ఎబెరే ఏడు రోజులపాటు ఏకధాటికగా ఏడ్చి చివరికి కంటి చూపు కోల్పోయి నిజంగానే ఏడ్చేశాడు. తీవ్రమైన తలనొప్పితోపాటు రెండు కళ్లూ ఉబ్బిపోయి ముఖమంతా వాచిపోయి ఇబ్బంది పడ్డాడు. దాదాపు 45 నిముషాల పాటు అతను తాత్కాలికంగా కంటి చూపు కోల్పోయినట్లు ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపాడు.

26 ఏళ్ల ఎబెరే వారంపాటు నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించి తాను తాత్కాలికంగా అంధత్వానికి గురైనట్లు ఇంటర్వ్యూలో తెలిపాడు. తిరిగి మామూలు మనిషిని కావడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు నిరంతరం ఏడవడం వల్ల తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అతిగా ఏడిస్తే శరీరంపైనా, కళ్లపైనా పలు రకాల దుష్ప్రభావాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చిరాకు, అలసట, తలనొప్పి, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. కళ్లు అధికంగా కన్నీరు కోల్పోతే దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఐతే ఇది పూర్తి అంధత్వానికి దారితీయదని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌