khammam: సమయం లేదు మిత్రమా..! డ్రైవర్ లేడని తెలిసి సీఐ చేసిన పనితో అంతా అవాక్కయ్యారు..
భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసాని లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన సందర్శించారు...త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది..దీనికి సంబందించిన పనులు జరుగుతున్నాయి. సిఐ ప్రారంభోత్సవానికి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈనేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో
ఖమ్మం, జులై26: సమయం చాలా విలువైనదని, దానిని వృధా చేయవద్దని..సిబ్బందికి చేసి చూపించారు ..పాల్వంచ సీఐ వినయ్ కుమార్… భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసాని లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన సందర్శించారు…త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది..దీనికి సంబందించిన పనులు జరుగుతున్నాయి.
సిఐ ప్రారంభోత్సవానికి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈనేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాక్టర్ లెవలింగ్ చేయకుండా ఖాళీగా ఉండటంతో లెవలింగ్ పనులు ఎందుకు కొనసాగడం లేదని సిబ్బందిని ఆరా తీశారు . ట్రాక్టర్ డ్రైవర్ భోజనానికి వెళ్ళాడని అతను రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో తానే స్వయంగా ట్రాక్టర్ డ్రైవర్ గా రంగంలోకి దిగారు. లెవెలర్ తో ప్రాంగణంలోని ఎత్తుపల్లాలను సరి చేశారు.
పెద్ద బాధ్యతలో ఉన్న అధికారి సమయం చాలా విలువైనదని, హోదా కంటే పని పట్ల నిబద్ధతను మాటలతో కాక చేతలతో చాటి చెప్పడంతో పోలీస్ సిబ్బంది అవాక్కయ్యారు. పోలీస్ స్టేషన్ ఆవరణ బాగుండాలనే తపనతో హోదాను పక్కన పెట్టి సీఐ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసి.. నిరాడంబరతను చాటి తోటి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు…
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..