పురాతన ఇంటిని కూల్చివేస్తుండగా దొరికిన బంగారు నిధి.. పోలీసులెత్తుకెళ్లారంటూ కంప్లైంట్‌.. అసలేమైందంటే..

గతంలో నవ్‌సారి జిల్లాలోని నవ్‌సారి సూరత్ మార్గ్‌లోని కస్బా గ్రామంలో జరిగిన తవ్వకంలో కూలీలకు భారీ సంఖ్యలో బంగారు ఆభరణాలు లభించగా, వారసుడు కనిపించకపోవడంతో ప్రభుత్వం దానిని తన ఖజానాలో వేసుకుంది. ఈ ఘటనలో కూడా బయటపడ్డ కోట్లాది బంగారం ఆ ఇంటి అసలు యజమానులకు అందుతుందా లేక ప్రభుత్వం జప్తు చేస్తుందా చూడాలి మరీ.!

పురాతన ఇంటిని కూల్చివేస్తుండగా దొరికిన బంగారు నిధి.. పోలీసులెత్తుకెళ్లారంటూ కంప్లైంట్‌.. అసలేమైందంటే..
Gold Coins
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2023 | 9:10 AM

గతంలో బ్యాంకుల్లో కాకుండా ప్రజలు తమ విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఆస్తులు, సామాగ్రిని వారి ఇంట్లోనే దాచుకునేవారు.. శిథిలావస్థలో ఉన్న వారి ఇళ్లను కూల్చివేస్తుండగా అప్పుడప్పుడు ఇలాంటి గుప్త ఆస్తులు దొరుకుతుంటాయి.. అలాంటి ఘటనే నవ్‌సారి జిల్లా బెలిమోరా పట్టణంలో చోటుచేసుకుంది.150 ఏళ్ల నాటి 240 బంగారు నాణేలు.. స్థానిక మసీదు సమీపంలోని ఓ ముస్లిం కుటుంబానికి చెందిన షబీర్‌భాయ్ బలివాలా ఇంట్లో దొరికింది. శతాబ్ద కాలం నాటి శిథిలావస్థలో ఉన్న వారి ఇంటిని కూల్చివేస్తుండగా బంగారు నాణేలు బయటపడ్డాయట. అయితే, ఆ నాణేలను నిరుపేద కూలీలు మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లారని, చివరికి నలుగురు పోలీసు అధికారులు ఆ బంగారు నాణేలను దొంగిలించారనే వార్తలు, ఆరోపణలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, పురాతన ఇంటిలో దొరికిన బంగారు నాణేలు ఒక్కొక్కటి రూ.3-4 లక్షల విలువైనవిగా చెబుతున్నారు. నాణేలు తీసుకున్న పోలీసులు కనిపించకుండా పారిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. కాగా, ఈ విషయాన్ని పరిశీలించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన ముస్లీం కుటుంబం.. గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో పాత ఇంటిని ధ్వంసం చేస్తున్నప్పుడు బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని చూసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిథిలాల్లో బయటపడిన నాణేల్లో ఒకదాన్ని వారు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి చూపించారట. ఇది 1922లో బ్రిటిష్ మింట్‌చే ఉత్పత్తి చేయబడిన పరిమిత-ఎడిషన్ నాణేం వలె వర్గీకరించబడింది. దీని బరువు 7.08 గ్రాములు, కింగ్ జార్జ్ VI చిత్రపటం కూడా నాణేంపై ఉంది. నాణెం 90% బంగారంతో తయారు చేయబడింది. SIT ప్రకారం, లాట్‌లోని అన్ని నాణేలు ఒకే వర్గానికి చెందినవి.

లండన్‌లో నివసిస్తున్న ఇంటి యజమాని ఇంతియాజ్ బలియా పాత ఇంటిని ధ్వంసం చేసే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను రాంకుబాయి, ఆమె కుటుంబ సభ్యులను నియమించుకున్నాడు. అయితే, ఇంట్లో దొరికిన బంగారు నాణేలను రాంకుబాయి, ఆమె కుటుంబ సభ్యులు వాటిని తమ రాష్ట్రం తీసుకుపోయి ఇంట్లో పాతిపెట్టారు. అయితే, ఈ నెల 19న సోండ్వా పోలీస్‌ స్టేషన్‌ అధికారి విజయ్‌ దేవ్‌డా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు రాకేష్ , వీరేంద్ర, సురేంద్ర సివిల్‌ డ్రెస్‌లో తమ ఇంటికి వచ్చారని రాంకుబాయి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంటికి వచ్చిన పోలీసులు వారిపై దాడి చేశారని, బంగారు నాణేలు తీసుకుని పారిపోయారంటూ రాంకుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన పోలీసులను సస్పెండ్‌ చేసి వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

గతంలో నవ్‌సారి జిల్లాలోని నవ్‌సారి సూరత్ మార్గ్‌లోని కస్బా గ్రామంలో జరిగిన తవ్వకంలో కూలీలకు భారీ సంఖ్యలో బంగారు ఆభరణాలు లభించగా, వారసుడు కనిపించకపోవడంతో ప్రభుత్వం దానిని తన ఖజానాలో వేసుకుంది. ఈ ఘటనలో కూడా బయటపడ్డ కోట్లాది బంగారం ఆ ఇంటి అసలు యజమానులకు అందుతుందా లేక ప్రభుత్వం జప్తు చేస్తుందా చూడాలి మరీ.!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..