95 రోజుల్లో 4 వేల మొబైల్ ఫోన్స్ దొరికాయి.. ఈ దర్యాప్తులో అన్నీ ఆసక్తికర అంశాలే.. తెలిస్తే అవాక్కే..!
వరంగల్ కమిషనరేట్ లో 300 ఫోన్స్ హైదరాబాద్ కమిషనరేట్ లో 265 మొబైల్స్ ను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు..మొబైల్ పోతే మీ సేవకు వెళ్ళే బదులు తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ ను వినియోగించుకోవాలనీ పోలీసులు సూచిస్తున్నారు.
తెలంగాణ పోలీసులు మరో కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CEIR ద్వారా ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తుల మొబైల్స్ కనుగొనే అంశంలో రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. ఏప్రిల్ 20 నుండి జూలై 23 వరకు 49621 మొబైల్స్ బాధితులు ఫిర్యాదులు చేయగా ఇందులో 9720 మొబైల్స్ ను ట్రేస్ చేశారు పోలీసులు. ఇందులో 4083 అంటే దాదాపు 42 శాతం మందికి పోగొట్టుకున్న వారి మొబైల్ ఫోన్స్ తిరిగి వారికి అందజేశారు పోలీసులు.
దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్స్ ని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ceir పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మే 17న అధికారికంగా ఈ పోర్టల్ ప్రారంభమైంది. తెలంగాణలో ఏప్రిల్ 19 నుండి బాధితుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. సిఐడి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఈ పోర్టల్ కి తెలంగాణ నుండి నోడల్ అధికారిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 780 పోలీస్ స్టేషన్లో CEIR యూజర్ ఐడి లను ఇచ్చారు. వీటి పై ప్రతిరోజు సిఐడి రివ్యూ చేస్తుంది.
దేశవ్యాప్తంగా రెండో స్థానంలో తెలంగాణ..
పోయిన మొబైల్స్ ని పట్టుకున్న వారిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్లో 554 మొబైల్స్ ను పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 321 మొబైల్ ఫోన్స్ ని పట్టుకున్నారు. వరంగల్ కమిషనరేట్ లో 300 ఫోన్స్ హైదరాబాద్ కమిషనరేట్ లో 265 మొబైల్స్ ను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు..మొబైల్ పోతే మీ సేవకు వెళ్ళే బదులు తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ ను వినియోగించుకోవాలనీ పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..