Telangana: న్యూజిలాండ్‌లో బ్రాండ్ మన ఇలాకాలో.. కవ్వాల్ అడవుల్లో కనువిందు చేసిన అరుదైన దృశ్యం..
కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు. కాగజ్ నగర్ పరిధిలోని వేంపల్లి రేంజ్ అటవీ ప్రాంతంలో ఏకంగా న్యూజిలాండ్ కరెన్సీ మీద దర్శనమిచ్చే పుట్టగొడుగులు తలుక్కుమన్నాయి. అరుదైన జాతికి చెందిన నీలి పుట్టగొడుగులుగా గుర్తించారు అటవిశాఖ అధికారులు. ఈ నీలి పుట్ట గొడుగులను స్కైబ్లూ మష్రూమ్స్ అని ఇటీవలే మొలిచినట్లు వేంపల్లి రేంజ్లోని..
కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు. కాగజ్ నగర్ పరిధిలోని వేంపల్లి రేంజ్ అటవీ ప్రాంతంలో ఏకంగా న్యూజిలాండ్ కరెన్సీ మీద దర్శనమిచ్చే పుట్టగొడుగులు తలుక్కుమన్నాయి. అరుదైన జాతికి చెందిన నీలి పుట్టగొడుగులుగా గుర్తించారు అటవిశాఖ అధికారులు. ఈ నీలి పుట్ట గొడుగులను స్కైబ్లూ మష్రూమ్స్ అని ఇటీవలే మొలిచినట్లు వేంపల్లి రేంజ్లోని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. 1989లో ఒడిశా రాష్ట్రంలో వీటిని భారతదేశంలో మొదటి సారిగా గుర్తించినట్లు వివరించారు. ఈ స్కైల్లూ మష్రూమ్స్ పుట్టగొడుగులకు న్యూజిల్యాండ్ పుట్టినిల్లు కావడంతో.. ఆ దేశపు కరెన్సీ నోటుపై కూడా వీటి చిహ్నాన్ని ఉంచుతారని తెలిపారు. న్యూజిలాండ్ దేశపు $50 నోటు మీద ఇది కనిపిస్తుందని.. ఈ పుట్టగొడుగులను ఆ దేశ జాతీయ ఫంగస్‌గా కూడా గుర్తించారని… ఈ పుట్టగొడుగు ఎంతో అరుదైనది.. దీనిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని అటవీశాఖ అధికారి వేణుగోపాల్ టీవి9 కు తెలిపారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో నీలి పుట్టగొడుగులు విస్తృతంగా పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు. జీవ వైవిధ్యానికి కాగజ్ నగర్ అటవి ప్రాంతం నిలయంగా మారిందన్నారు అటవిశాఖ అదికారులు. ఈ పుట్టగొడుగులు ఆల్-బ్లూ మష్రూమ్ జాతివని… వీటి శాస్త్రీయనామం ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరని.. వీటినే ‘బ్లూ పింక్ గిల్’ లేదా ‘స్కై-బ్లూ మష్రూమ్’ గా పిలుస్తారని తెలిపారు నిపుణులు. ఈ జాతి పుట్టగొడుగులు గులాబీ, ఊదా రంగులను కలిగి ఉంటాయని.. జూలై 20న కవ్వాల్ టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తమకు ఈ పుట్టగొడుగులు కనిపించాయని కాగజ్ నగర్ డివిజనల్ పారెస్ట్ అదికారి తెలిపారు. వీటిని ఆహారంగా తీసుకోకపోవటమే మంచిదని… ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్‌లను కలిగి ఉంటాయని సమాచారం. వివిధ వ్యాధుల నివారణ, మెడిసిన్ తయారీలోనూ ఇవి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన పుట్టగొడుగులు పాత ఆదిలాబాద్ అడవుల్లో దర్శనమివ్వడంతో వాటిని సంరక్షించే బాధ్యత ను వెంటనే తీసుకుంటామని తెలిపింది తెలంగాణ అటవిశాఖ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..