Surprise: ఆలయంలో నీళ్లు తాగుతున్న నందీశ్వరుడు.. ఈ వింత ఎక్కడ చోటు చేసుకుందంటే..

Nirmal News: నిర్మల్‌ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని నంది నీళ్లు తాగుతోందనే ప్రచారం జరుగుతోంది. జూలై 22 రాత్రి నుంచి నంది నీళ్ళు తాగడం గమనించామని భక్తులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు ఆలయానికి తండపతండాలుగా తరలి వచ్చారు.

Surprise: ఆలయంలో నీళ్లు తాగుతున్న నందీశ్వరుడు.. ఈ వింత ఎక్కడ చోటు చేసుకుందంటే..
Nandi Idol
Follow us

|

Updated on: Jul 23, 2023 | 3:20 PM

Nirmal, July 23: నిర్మల్‌ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని నంది నీళ్లు తాగుతోందనే ప్రచారం జరుగుతోంది. జూలై 22 రాత్రి నుంచి నంది నీళ్ళు తాగడం గమనించామని భక్తులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు ఆలయానికి తండపతండాలుగా తరలి వచ్చారు. నంది విగ్రహానికి నీళ్లు తాపేందుకు పోటీ పడినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భైంసా మండలం వానల్‌ పాడ్‌ గ్రామంలో నంది విగ్రహం నీళ్లు తాగడం గమనించామని వెంటనే మరి కొన్ని నీళ్లు తాగించినట్లు చెబుతున్నారు. ఆలయంలో నంది విగ్రహం నీళ్లు తాగుతుందన్న వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లోని నంది విగ్రహాలవద్దకు క్యూకట్టారు ప్రజలు. వానల్‌పాడ్‌, పాండ్రిగల్లి, పులే నగర్‌తోపాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లోని నంది విగ్రహాలకు నీళ్లు తాగించేందుకు పోటీపడ్డారు భక్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..